భైంసాటౌన్, జూలై 3 : మండలంలోని వాలేగాం శివారులోని ప్రభుత్వ భూమిలో కొంతమంది అక్రమ పట్టాలు పొందారని, రీ సర్వే చేసి విచారణ చేపట్టాలని భైంసా-బాసర మార్గంలోని దేగాం వద్ద జాతీయ రహదారిపై పలువురు గ్రామస్తులు రాస్తారోకో చేశారు.
ఈ విషయమై రెండేళ్లుగా తహసీల్దార్లు, ఆర్డీవో, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినా చర్యలు తీసుకోలేదన్నారు. అధికారులు భూములు ఉన్న వారికే భూములు కట్టబెట్టారని ఆరోపించారు. రూరల్ ఎస్ఐ సుప్రియ ధర్నా స్థలానికి చేరుకొని ఆందోళనకారులను నచ్చజెప్పినా రెవెన్యూ అధికారులు వచ్చే వరకూ కదిలేదని కూర్చున్నారు.