కెరమెరి, ఫిబ్రవరి 4: మండలంలోని మహరాజ్గూడ అటవీ ప్రాంతంలోని అమ్మవారి సన్నిధిలో భక్తుల పూజలు కొనసాగుతున్నాయి. జంగుబాయి దేవత దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఈ నెల 8న ఈ వేడుకలు ముగియనున్నాయి.
దీంతో ఆయా ప్రాంతాల భక్తులు అమ్మవారి దీవెన కోసం ఎంతో ఆసక్తి చూపుతున్నారు. యేటా పుష్యమాసంలో జంగుబాయి గుహలను దర్శించడం ఆదివాసీలకు ఆనవాయితీగా వస్తున్నది. అమ్మవారికి తీపి పిండివంటలు, రావుడ్క్పేన్, పోచమ్మతల్లి, మైసమ్మ వద్ద మేకలు, కోళ్లను బలిచ్చి అక్కడే వంటలు వండి సహపంక్తి భోజనం చేసి తిరుగు ప్రయాణం చేస్తున్నారు.