సిరికొండ, అక్టోబర్ 6 : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమం, సమన్యాయపాలను దేశవ్యాప్తంగా అమలు చేసేందుకు టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా మారుస్తూ సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలు స్వాగతిస్తున్నారని టీఆర్ఎస్(బీఆర్ఎస్) గ్రామాధ్యక్షుడు మల్లేశ్, విద్యార్థి విభాగం నియోజకవర్గ కన్వీనర్ శంకర్ యాదవ్ అన్నారు. బీఆర్ఎస్ ప్రకటనతో గురువారం మండల కేంద్రంలో నాయకులు పటాకులు కాలుస్తూ సంబురాలు జరుపుకున్నారు. కార్యక్రమంలో నాయకులు కైలాస్, ప్రభాకర్, హైదర్, మల్లయ్య, పోశన్న, తదితరులు పాల్గొన్నారు.
ఇచ్చోడలో..
సిరికొండ, అక్టోబర్ 6 : టీఆర్ఎస్ నుంచి భారత్ రాష్ట్ర సమితి(బీఆర్ఎస్)గా మారిన నేపథ్యంలో ఇచ్చోడలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద పార్టీ మండలాధ్యక్షుడు కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో శ్రేణులు సంబురాలు జరుపుకున్నారు. పటాకులు కాలుస్తూ మిఠాయిలు పంచిపెట్టారు. దేశ్‌కీ నేత కేసీఆర్, బీఆర్ఎస్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ సుభాష్ పటేల్, టీఆర్ఎస్(బీఆర్ఎస్) నాయకులు ప్రవీణ్, పురుషోత్తం రెడ్డి, అబ్దుల్ రషీద్, గంగయ్య, తదితరులు పాల్గొన్నారు.
నేరడిగొండలో..
నేరడిగొండ, అక్టోబర్ 6 : సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ను భారత్ రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) జాతీయ పార్టీగా మార్పు చేస్తూ తీర్మానం చేసిన సందర్భంగా మండల కేంద్రంలో టీఆర్ఎస్(బీఆర్ఎస్) శ్రేణులు సంబురాలు నిర్వహించారు. ప్రధాన కూడలి వద్ద పటాకులు కాల్చారు. దేశ్‌కీ నేత కేసీఆర్ అంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ రాథోడ్ సజన్, టీఆర్ఎస్(బీఆర్ఎస్) మండల కన్వీనర్ శివారెడ్డి, వైస్‌ఎంపీపీ మహేందర్‌రెడ్డి, సర్పంచ్ విశాల్‌కుమార్, మాజీ ఎంపీటీసీ పోశెట్టి, నాయకులు గణేశ్, పాషా పాల్గొన్నారు.