Sports School | హనుమకొండ స్పోర్ట్స్స్కూల్ అడ్మిషన్ ప్రక్రియ పూర్తి
హనుమకొండ జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలోని జిల్లా యువజన, క్రీడల అధికారి కార్యాలయంలో స్పోర్ట్స్స్కూల్లో ప్రవేశాలకు సంబంధించిన ఎంపిక ప్రక్రియలో భాగంగా ఎంపికైన బాలుర ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించారు.
హనుమకొండ చౌరస్తా, జూలై 7: హనుమకొండ జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలోని జిల్లా యువజన, క్రీడల అధికారి కార్యాలయంలో స్పోర్ట్స్స్కూల్లో ప్రవేశాలకు సంబంధించిన ఎంపిక ప్రక్రియలో భాగంగా ఎంపికైన బాలుర ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించారు. ఇటీవల హైదరాబాద్ హకింపేటలో జరిగిన రాష్ర్టస్థాయి ఎంపికల్లో ప్రతిభ కనబర్చి హనుమకొండ స్పోర్ట్స్‌స్కూల్‌కు ఎంపికైన బాలుర సర్టిఫికెట్లను జిల్లా యువజన, క్రీడల అధికారి కొత్త ప్రశాంత్ ఆధ్వర్యంలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపికైన క్రీడాకారులు, వారి తల్లిదండ్రులకు డివైఎస్ఓ కొత్త ప్రశాంత్ స్వాగతం పలికి అడ్మిషన్ ప్రక్రియ, హాస్టల్ వసతులు, నాణ్యమైన క్రీడా శిక్షణ, విద్యా సౌకర్యాల గురించి వివరించారు.
స్పోర్ట్స్ స్కూల్లో లభించే అవకాశాలను సద్వినియోగం చేసుకుని క్రమశిక్షణతో సాధన చేస్తూ రాష్ర్ట, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించి హనుమకొండ జిల్లా, తెలంగాణ రాష్ట్రానికి మంచిపేరు తీసుకురావాలని సూచించారు. బాలికలు, బాలుర అడ్మిషన్ ప్రక్రియ విజయవంతంగా ముగిసిందని తెలిపారు. ఎంపికైన వారికి క్రీడా శిక్షణా కార్యక్రమాలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారులు, కోచ్‌లు, కార్యాలయ సిబ్బంది, ఎంపికైన క్రీడాకారులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
Road accident | కారు, బైక్‌ను ఢీకొట్టిన లారీ.. పలువురికి తీవ్ర గాయాలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
Srisailam | నేటి నుంచి శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
Hyderabad | ఆరేళ్ల పాప మిస్సింగ్ కేసు విషాదాంతం.. చంపేసి, సెల్లార్లో పడేసిన సెక్యూరిటీ గార్డు!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

