ఉట్నూర్, జూలై 11 : హామీ ఇచ్చిన మేరకు కుఫ్టీ, అడ ప్రాజెక్టు పనులను పూర్తి చేస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. గురువారం రైతు భరోసా కార్యక్రమం అనంతరం మీడియాతో మాట్లాడారు. తాను ఆదిలాబాద్ జిల్లాలో పాదయాత్ర ప్రారంభించి నెలరోజుల పాటు ఇక్కడే ఉన్నానన్నారు. ఇక్క డి ప్రజల, రైతుల సమస్యలు నేరుగా తెలుసుకోవడం జరిగిందన్నారు. ఏజెన్సీలో రైతు లు వర్షాధారిత పంటలపై ఆధారపడడం, ఏజెన్సీలో గిరిజన, గిరిజనేతరుల సమస్యలు తెలుసన్నారు. తమ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీల కోసం సమావేశాలు నిర్వహిస్తున్న ట్లు పేర్కొన్నారు. ఆగస్టులోగా రుణమాఫీ చేస్తామన్నారు. ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు.
తాజాగా రైతుల నుంచి తీసుకున్న అభిప్రాయాలను క్రోడీకరించి నివేదిక రూపంలో శాసనసభ ముందు ఉంచుతామన్నారు. దీనిపై శాసనసభ్యుల అభిప్రాయాలను కూడా సేకరిస్తామన్నారు. న్యాయబద్ధం గా, ధర్మబద్ధంగా అందరికీ అందేలా చర్య లు తీసుకుంటామన్నారు. ఈ పథకాన్ని ఎక్కడ కూడా దుర్వినియోగం కాకుండా చూస్తామన్నారు. ఈ సమావేశంలో మంత్రు లు శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావు, సీతక్క, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, చెన్నూర్ ఎమ్మె ల్యే వివేక్, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు, ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, ఆసిఫాబాద్ కలెక్టర్లు రాజర్షి షా, అభిలాష అభినవ్, దీపక్ కుమార్, వెంకటేశ్ ధోత్రె, ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా, పాల్గొన్నారు.