జన్నారం, జూన్ 6 : ప్రభుత్వ పాఠశాలల్లో ఎక్కువ మంది పిల్లలను చేర్పించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని మంచిర్యాల జిల్లా విద్యాధికారి ఎస్ యాదయ్య చెప్పారు. గురువారం మండలంలోని పొనకల్ మండల పరిషత్ పాఠశాలలో నిర్వహించిన జయశంకర్ బడి బాట కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. జన్నారం మండలం అన్ని రంగాల్లో ప్రథమ స్థానంలో నిలుస్తున్నదని, విద్యార్థుల అడ్మిషన్లలోనూ ప్రథమ స్థానంలో నిలిచేలా ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు.
అనంతరం బడి బాట కార్యక్రమంలో భాగంగా పొనకల్ గ్రామంలోని పలు కాలనీల్లో ర్యాలీ తీశారు. అనంతరం కవ్వాల్, అక్కపెల్లిగూడలో అమ్మ ఆదర్శ పాఠశాలలను సందర్శించి సంతృప్తి వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో ఎంఈవో నడిమెట్ల విజయ్‌కుమార్, ఎంపీడీవో శశికళ, ఎంపీవో రమేశ్, కొండు జనార్దన్, ప్రధానోపాధ్యాయుడు జాజాల శ్రీనివాస్, కార్యదర్శి రాహుల్, అనిల్ పాల్గొన్నారు.