మంచిర్యాలటౌన్, జూలై 15 : గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మంచిర్యాల పట్టణంలో రూ.4కోట్ల వ్యయంతో రెండేళ్ల క్రితం ప్రధాన కూడళ్లలో నిర్మించిన జంక్షన్లను కూల్చివేస్తున్నారు. లక్ష్మి థియేటర్, టీటీడీ కల్యాణ మండపం చౌరస్తాల వద్ద నిర్మించిన వృత్తాకార జంక్షన్లను మంగళవారం అధికారులు జేసీబీల సాయంతో కూల్చివేశారు. ఈ ప్రాంతాల్లో రోడ్లను విస్తరించాల్సి ఉందన్న దృష్ట్యా పెద్దసైజు ఐలాండ్లు ట్రాఫిక్‌కు అడ్డంకి మారుతున్నాయని భావించి, వాటిని తొలగించి చిన్న సైజు జంక్షన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
ఇదే తరహాలో ఐబీ చౌరస్తా, బెల్లంపల్లి చౌరస్తాల్లోను ఇటీవల మార్పులు చేపట్టారు. గతంలో ఒక్కో జంక్షన్‌కు కోటి రూపాయల చొప్పున ఖర్చుపెట్టి గ్రీనరీ, శిల్పాలు, ఫౌంటెన్లు, లైటింగ్‌తో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. ట్రాఫిక్ సిగ్నల్స్ అవసరం లేకుండా ట్రాఫిక్ నియంత్రణకు వీటిని నిర్మించినట్లు అప్పటి ప్రణాళిక. మంచిర్యాల జిల్లా కేంద్రంగా ఏర్పడిని తర్వతా పట్టణ అభివృద్ధిలో భాగంగా అప్పటి ఎమ్మెల్యే దివాకర్‌రావు ఆధ్వర్యంలో ఈ జంక్షన్లు నిర్మించబడ్డాయి. ప్రస్తుతం మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో ఇవి అవసరానికి మంచి ఉండడంతో, నగరశ్రేణి పెరుగుదలకు కొత్త ప్రణాళికలు అమలులోకి వస్తున్నాయి.