చింతలమానేపల్లి, మే 18 : కర్జెల్లి రేంజ్ పరిధిలోని దిందా బీట్‌లో చెట్ల నరికివేతకు సహకరించడంతో పా టు ఫారెస్ట్ భూమిని కొందరికి అప్పగించేందుకు సహకరిస్తున్నాడంటూ పలువురు గూడెం ఎఫ్ఎస్వో అక్తర్‌పై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో శనివారం దిందా బీట్‌లోని పలు కంపార్ట్మెంట్లలో జిల్లా డిప్యూటీ రేంజ్ టాస్క్‌ఫోర్స్ అధికారి సీహెచ్ రాజేశ్వరాచారి, టాస్క్‌ఫోర్స్ ఎఫ్ఎస్వో ఎండీ నాజర్ హు స్సేన్ విచారణ చేపట్టారు.
చాలా వరకు నరికి ఉన్న టేకు చెట్ల మొదళ్లను గుర్తించారు. బండేపల్లి బీట్లోనూ అధికంగా అడవి నరికివేతకు గురైనట్లు వివరాలు సేకరించా రు. ఈ విషయమై ఉన్నతాధికారులకు నివేదికలు అందజేస్తామని వారు తెలిపారు. చెట్లు నరికివేసి అటవీ భూ మిని ఆక్రమించిన బండేపల్లికి చెందిన దన్నురి సురేశ్‌పై ఈ నెల 14న కేసు నమోదు చేసినట్లు తెలిపారు. కర్జెల్లి రేంజ్ పరిధిలో అటవీశాఖ అధికారులే దగ్గరుండి స్మ గ్లింగ్ చేయిస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. గతంలో ఈ అంశంపై పలువురిపై సస్పెన్షన్ వేటు వేశారు.