బోథ్/భైంసా టౌన్/ముథోల్, అక్టోబర్ 20 ః ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో శనివారం అర్ధరాత్రి వర్షం కురిసింది. బోథ్ మండలంలోని కొన్ని ప్రాంతాల్లో గంటన్నరపాటు వర్షంతో కురియడంతో పంటలకు నష్టం వాటిల్లింది. బోథ్, మర్లపెల్లి, పొచ్చెర, కౌఠ(బీ), సొనాల ప్రాంతాల్లో కురిసిన వర్షంతో పత్తి, సోయా పంటలకు నష్టం వాటిల్లింది. సోయాబిన్ పంటతోపాటు కోసి ఉంచిన కుప్పలు, నూర్పిడి చేస్తున్న పనులకు అటంకం ఏర్పడింది. మరోవైపు ఎరే దశకు చేరకున్న పత్తి పంటకు నష్టం తీవ్ర నష్ట కలిగించింది. పత్తి బుగ్గలు వర్షానికి తడిచిపోయాయి. భైంసా మండలంలోని వాలేగాం, కుంసర, కామెల గ్రామాల్లో కుండపోత వర్షానికి కల్లాల్లోని సోయా, వరి ధాన్యం నీటిపాలు అయింది. ఉదయం కల్లాల్లో నిండిన నీటిని తీసివేశారు. ముథోల్ మండల కేంద్రమైన ముథోల్తోపాటు మండలంలోని ఆయా గ్రామాల్లో శనివారం అర్ధరాత్రి కురిసిన భారీ వర్షానికి వరి పంట పూర్తిగా నేలమట్టమైంది. కల్లాల్లోని సోయా తడవడంతో ఆర్థికంగా నష్టపోయామని వారు పేర్కొన్నారు. తక్షణమే సర్వే చేయించాలని డిమాండ్ చేస్తున్నారు.