తాండూర్ : పిడుగుపాటు ( Lightning ) తో పాడి ఆవు ( Dairy cow ) మృతి చెందిన సంఘటన తాండూర్ మండల కేంద్రంలో చోటుచేసుకుంది. తాండూర్ మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోని శివాజీ నగర్ కు చెందిన పెద్దబోయిన భూమయ్య అనే రైతుకు చెందిన పాడి ఆవును ఇంటి ముందర కట్టి ఉంచాడు.
ఆదివారం రాత్రి వర్షంతో పాటు పిడుగుపడి మృతి చెందిందని బాధిత రైతు వాపోయాడు. ఈ సందర్భంగా బాదితుడు భూమయ్య మాట్లాడుతూ సుమారు రూ.40వేల విలువగల ఆవు ద్వారా జీవనం సాగిస్తున్నట్లు తెలిపాడు. తనకు జీవనాధారమైన ఆవు మృతి చెందిందని ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరారు.