నార్నూర్, డిసెంబర్3 : అదిలాబాద్ జిల్లా కేంద్రంలో నిర్మించే ఎయిర్ పోర్ట్కు కుమ్రం భీం పేరు పెట్టాలని ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ జిల్లా అధ్యక్షుడు పేందోర్ దాది రావ్ డిమాండ్ చేశారు. బుధవారం ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండల కేంద్రంలోని కుమ్రం భీం విగ్రహం వద్ద విలేకరులతో మాట్లాడుతూ.. ఎయిర్ పోర్టుకు కుమ్రం భీం నామకరణం చేయాలన్నారు. ఆదివాసుల సమస్యల పరిష్కారంలో సీఎం రేవంత్ రెడ్డి విఫలవమయ్యారన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి అదిలాబాద్ పర్యటనలో భాగంగా ఆదివాసి సమస్యలపై స్పందించాలని, చట్టబద్ధతలేని లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని, జీవో నంబర్ 3ని పునరుద్దించాలని, ఆదివాసి గూడెలల్లో విద్య వైద్యం రోడ్డు తాగునీరు వంటి సమస్యలపై స్పందించవలసిన అవసరం ఎంతైన ఉందని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సలాం వరుణ్, జిల్లా సలహాదారుడు పెందోర్ దీపక్, మండల అధ్యక్షుడు కనక హన్మంత్ రావ్, ఉపాధ్యక్షుడు మెస్రం మోతిరామ్ తదితరులున్నారు.