దండేపల్లి : దేశ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతి ఒక్కరూ కాపాడుకోవాలని తెలంగాణ గిరిజన కార్పొరేషన్ చైర్మన్ (GC Chairman ) కోట్నాక తిరుపతి ( Cotnaka Tirupati ) అన్నారు. ఆదిలాబాద్ జిల్లా దండేపల్లి మండలం తాళ్లపేట గ్రామంలో శివ గణేష్ యూత్ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని నిర్వహించిన ముగ్గుల పోటీల బహుమతుల ప్రదానానికి సీఐ రమణమూర్తి, ఎస్సై తహసినుద్దీన్తో కలిసి ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందూ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక సంక్రాంతి ముగ్గులని అన్నారు. ప్రస్తుత డిజిటల్ యుగంలో యువతులు ముగ్గులు వేయడం మరిచిపోయారని పేర్కొన్నారు. శివ గణేష్ యూత్ సభ్యులు మరిన్ని సామాజిక, సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలన్నారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు ముస్తఫా, శివ గణేష్ యూత్ అధ్యక్ష, కార్యదర్శులు దుర్గం శేఖర్, దుర్గం రవీందర్, న్యాయ నిర్ణేతలు, సభ్యులు పాల్గొన్నారు.