నార్నూర్ : మద్యం సేవించి వాహనాలు నడిపితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని నార్నూర్ ఎస్సై అఖిల్ ( SI Akhil ) హెచ్చరించారు. సోమవారం మండలంలోని గంగాపూర్ గ్రామ సమీపం వద్ద వాహనాల తనిఖీ ( Vehicle Checking) నిర్వహించారు. వాహనాలకు సంబంధించిన పత్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, వాహనాలకు సంబంధించిన పత్రాలు అందుబాటులో ఉంచుకోవాలన్నారు.హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. ఆయన వెంట పోలీస్ సిబ్బంది ఉన్నారు.