ఉట్నూర్, జూన్25 : ఐటీడీఏ ఆశ్రమ పాఠశాలలో సీఆర్టీల నియామకానికి అర్హత పరీక్షను ఆదివారం పకడ్బందీగా నిర్వహించారు. పట్టణంలోని ప్రభుత్వ మెన్స్ డిగ్రీ కళాశాలలో 680 మందికి గాను 623 మంది హాజరయ్యారు. కుమ్రం భీం ప్రాంగణంలోని గిరిజన రెసిడెన్సియల్ గర్ల్స్ ఇంటర్ కళాశాలలో 264 మందికి గాను 255 మంది. క్రీడా ఆశ్రమ పాఠశాలలో 140 మందికి గాను 133మంది, గిరిజన బాలుర పాఠశాల లాల్ టేక్డిలో 288 మందికి గాను 264, లాల్ టేక్డి గిరిజన గురుకుల జూనియర్ కళాశాలలో 446 మందికి గాను 416 మంది హాజరైనట్లు అధికారులు తెలిపారు.
మొత్తం 1818 మంది అభ్యర్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా 1691 మంది అభ్యర్థులు హాజరయ్యారు. పరీక్షా కేంద్రాలను ఐటీడీఏ గిరిజన సంక్షేమశాఖ ఉప సంచాలకుడు దిలీప్ కుమార్ సందర్శించారు. ఆయన వెంట ఏసీఎంవో జగన్, జీసీడీవో చాయ, జిల్లా క్రీడాధికారి పార్థసారధి, అధికారులు, సిబ్బంది ఉన్నారు.