భీంపూర్, జూలై 24 : పెన్‌గంగ వరద ప్రభావంతో పంటలు దెబ్బతిన్న రైతులను ప్రభుత్వ పరంగా ఆదుకుటామని, ధైర్యంగా ఉండాలని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ భరోసానిచ్చారు. భీంపూర్ మండలం అర్లి, వడూర్ శివారు పెన్‌గంగ ముంపు పంటలను సోమవారం డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డితో కలిసి పరిశీలించారు. గుబ్డీ, గోముత్రి, అంతర్గాం, అర్లి, వడూర్, గొల్లగఢ్ శివార్లలో పెన్‌గంగ వరద బీభత్సంతో 1100 పై చిలుకు ఎకరాల్లో నష్టం జరిగినట్లు రైతులు పేర్కొన్నారు. అనంతరం ఎమ్మెల్యే ముంపు ఇళ్లవారితో మాట్లాడారు. వ్యవసాయ శాఖ అధికారులు పంట నష్టంపై అంచనా వేస్తారని తెలిపారు. ఎమ్మెల్యే వెంట జడ్పీటీసీ కుమ్ర సుధాకర్, ఎంపీపీ కుడిమెత రత్నప్రభ, వైస్ ఎంపీపీ గడ్డం లస్మన్న, బీఆర్ఎస్ మండల కన్వీనర్ మేకల నాగయ్య, సర్పంచులు గొల్లి రమాబాయి, హనుమద్దాసు, బక్కి లలిత, రైతు బంధు సమితి కన్వీనర్ అనిల్, నాయకులు గొల్లి లస్మన్న, సంజీవ్‌రెడ్డి, వైభవ్, కపిల్, సామ నాగారెడ్డి, ఉల్లాస్ దేశ్‌ముఖ్ రైతులు ఉన్నారు.
సహకార బ్యాంక్ భవనం ప్రారంభం..
భీంపూర్ మండల కేంద్రంలో సహకార బ్యాంక్ నూతన భవనాన్ని డీసీసీబీ చైర్మన్‌తో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. తరాలుగా ఉన్న ఈ బ్యాంకులు రైతునేస్తాలని ఎమ్మెల్యే అన్నారు. కార్యక్రమంలో పీఏసీఎస్ ఉపాధ్యక్షుడు ధనంజయ్, సీఈవో కేశవ్, డైరెక్టర్ ఏనుగు అశోక్‌రెడ్డి, సర్పంచులు మడావి లింబాజీ, బాదర్, అజయ్, ఉప సర్పంచ్ జాదవ్ రవీందర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు ఉత్తంరాథోడ్, రవుఫ్, బ్యాంక్ మేనేజర్ ప్రవీణ్‌రెడ్డి, సిబ్బంది వివేక్, పురుషోత్తం, ప్రవీణ్‌కుమార్, కర్నేవార్ గణేశ్, నాయకులు పురుషోత్తం, కళ్లెం శ్రీనివాస్ రెడ్డి, వినోద్ ఉన్నారు.
కమ్యూనిటీ హాల్ ప్రారంభం..
తాంసి, జూలై 24 : మండలంలోని గోట్కూరి గ్రామంలో నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ హాల్‌ను డీసీసీబీ చైర్మన్ బోజారెడ్డితో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా రాథోడ్ బాపురావ్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ అన్ని వర్గాల సంక్షేమానికి కృషిచేస్తున్నారన్నారు. అనంతరం ఎమ్మెల్యేను జిల్లా వికలాంగుల నిరుద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆకుల సునీల్‌కుమార్ నాయకులతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సురకుంటి మంజులాశ్రీధర్ రెడ్డి, వైస్ ఎంపీపీ ముచ్చ రేఖారఘు, సర్పంచులు సదానందం, వెంకన్న, బీఆర్ఎస్ నాయకులు అరుణ్, సునీల్, గడుగు గంగన్న, వార్డు సభ్యులు పాల్గొన్నారు.