నిర్మల్ అర్బన్, డిసెంబర్ 30 : జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు పెద్దపీట వేస్తూ జిల్లా ప్రజల కు 24 గంటల పాటు మెరుగైన సేవలంది స్తామని నిర్మల్ ఎస్పీ సీహెచ్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో గురు వారం వార్షిక నేర జాబితా విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో నేరాలను పూర్తిగా తగ్గించి నేర రహిత జిల్లాగా తీర్చిదిద్దుతామన్నారు. ఇందుకు జిల్లా ప్రజల సహకారం ఎంతో అవసరమని చెప్పారు. జిల్లాలో గతేడాదితో పోల్చితే ఈ సంవత్సరం నేరాల సంఖ్య 7 శాతం పెరిగిందన్నారు. గతేడాది 2521 కేసులు కాగా ఈ ఏడాది 2703 నమోదయ్యా యని తెలిపారు. మర్డర్, పోక్సో కేసులు 2020లో 49 ఉండగా..2021లో 55 పెరిగాయన్నారు. జిల్లాలో 169 దొంగతనాలు జరిగాయని, ఇందు లో రూ.97,64,230 సొమ్మును రికవరీ చేశామ న్నారు. దొంగతనాలను నివారించేందుకు పెట్రో లింగ్‌ను విస్తృతం చేస్తామని చెప్పారు. జిల్లాలో 275 రోడ్డు ప్రమాదాలు జరుగగా, 135 మంది మృతి చెందారని, 340 మంది గాయపడ్డారని తెలిపారు. రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ చేపడుతా మని పేర్కొన్నారు. ఎంవీ యాక్టు ద్వారా 2,46, 344 వాహనాలకు 8,99,88,810 జరిమానా వసూలు చేశామన్నారు.
అతిగా మద్యం తాగిన వాహనాలు నడిపిన 25 మందికి జైలు శిక్ష విధిం చామని పేర్కొన్నారు. జిల్లాల్లో మిస్సింగ్ కేసుల సంఖ్య సైతం పెరిగిందని, గతేడాది 154 ఉండగా 215 చేరిందన్నారు. కల్తీ విత్తనాల కేసుల సంఖ్య ను తగ్గించామని పేర్కొన్నారు. జిల్లాలో సైబర్ క్రైమ్ కేసుల సంఖ్య 9 నుంచి 16 కు పెరిగిందని వీటికి అడ్డు కట్ట వేసేందుకు విస్తృతంగా అవగా హన కల్పిస్తున్నామని వివరించారు. డయల్ 100 కాల్‌కు 11732 మంది ఫిర్యాదు చేశారని తెలిపా రు. జిల్లాలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిం చిన 8మందిపై పీడీ యాక్టు కేసులు నమోదు చేశామన్నారు. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ కు కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా 2117 కెమెరాలను ఏర్పాటు చేశామన్నారు. జనవరిలో ఆపరేషన్ స్మైల్ కార్యక్ర మాన్ని నిర్వహించను న్నామని, ఇందులో భిక్షాటన చేసే చిన్నారులు, ఇటుక బట్టీల్లో పని చేసే బాల కార్మికులకు విముక్తి కల్పిస్తామన్నారు. యజమానులపై చర్యలు తీసు కుంటామని పేర్కొన్నారు. సమావేశంలో భైంసా ఏఎస్పీ కిరణ్ ఖారే, రాంరెడ్డి, వెంకటేశ్వర్లు, డీఎస్పీలు ఉపేందర్‌రెడ్డి, జీవన్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్‌ను కలిసిన ఎస్పీ
ఎస్పీ సీహెచ్ ప్రవీణ్ కుమార్ క్యాంపు కార్యాల యంలో జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీని మర్యాద పూర్వకంగా కలిశారు. పూలమొక్కను అందజేశారు.