సీసీసీ నస్పూర్, మార్చి 6 : అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని సింగరేణి మహిళలకు గురువారం సాయంత్రం క్రికెట్ పోటీలు నిర్వహించారు. సీసీసీ ఆఫీసర్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీలను డైరెక్టర్(ఆపరేషన్స్) సూర్యనారాయణ సతీమణి మాలతి ప్రారంభించారు.
కొద్దిసేపు క్రికెట్ ఆడి ఉత్సాహపరిచారు. ఈ కార్యక్రమంలో శ్రీరాంపూర్ జీఎం శ్రీనివాస్, సేవా అధ్యక్షురాలు ఉమారాణి, క్లబ్ కార్యదర్శి తిరుపతి, స్పోర్ట్స్ కార్యదర్శి శ్రీధర్, లేడీస్ క్లబ్ కార్యదర్శి దివ్య, క్రీడాకారులు పాల్గొన్నారు.