మంచిర్యాల ఏసీసీ, మే 6 : మద్యం మత్తులో ఓ యువకుడు వీరంగం సృష్టించగా, సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని లడ్డ డిజిటల్ మల్టీ బ్రాండ్ మెగా ఎలక్ట్రానిక్ షోరూంలో బుధవారం నస్పూర్‌కు చెందిన వెంకటేశ్ మద్యం మత్తులో నగ్నంగా తిరుగుతూ వీరంగం సృష్టించాడు. వెంకటేశ్ బుధవారం షాపుకు వచ్చి టీవీ, ఫ్రిజ్ కొనుగోలు చేశాడని, బిల్లు కట్టిన తర్వాత టీవీ డెలివరీ కాకా ముందే ఇంటికి వచ్చి ఫిట్ చేయాలని గొడవకు దిగినట్లు షాపు యజమాని సుమిత్ లడ్డ తెలిపారు.
రెండు రోజులు పడుతుందని చెప్పినా వినకుండా షాపులోనే మద్యం సేవించి టేబుల్ మీదున్న వస్తువులను చిందరవందరగా పడేశాడని, అనంతరం షాపు ముందుకు వెళ్లి బట్టలు విప్పేసి నగ్నంగా వీరంగం సృష్టంచాడని, పోలీసులకు సమాచారం ఇవ్వగా, అంతకుముందే అతడి కుటుంబ సభ్యులు వచ్చి తీసుకెళ్లారని ఆయన తెలిపాడు. కాగా, ఇందుకు సంబంధించిన వీడియో గురువారం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.