హాజీపూర్ : ప్రభుత్వ ఉద్యోగుల పాలిట శాపంగా మారిన సెప్టెంబర్ 1న సీపీఎస్ విద్రోహ దినాన్ని (CPS Rebellion Day) విజయవంతం చేయాలని ఐక్య ఉపాధ్యాయ సంఘాలు, పెన్షన్ల జేఏసీ చైర్మన్, టీఎన్జీవో యూనియన్ జిల్లా అధ్యక్షులు గడియారం శ్రీహరి ( President Srihari ) పిలుపునిచ్చారు. శుక్రవారం ఈ మేరకు సన్నాహక సమావేశాన్ని జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో భవన్ లో నిర్వహించారు.
ఆయన మాట్లాడుతూ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు సీపీఎస్‌ను రద్దుచేసి ఓపీఎస్ ( OPS ) విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ఉద్యోగ సంఘాల జేఏసీ పిలుపు మేరకు సెప్టెంబర్ ఒకటిన జిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగులందరూ నస్పూర్ లో ఉన్న జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలను ధరించి నిరసనలో పాల్గొనాలని కోరారు.
సన్నాహక సమావేశంలో ఉద్యోగ సంఘాల జేఏసీ కో చైర్మన్ పొన్న మల్లయ్య, శ్రీపతి బాబురావు, గండికోట వేణుగోపాల్, కమటం రామకృష్ణ, పోడేటి సంజీవ్, గిట్ల సుమిత్, రాసపల్లి రవి, భూముల రామ్మోహన్, జై కృష్ణ, బొడ్డు శ్రవణ్ కుమార్, పూదరి నరేందర్ తదితరులు పాల్గొన్నారు.