హాజీపూర్/బెల్లంపల్లి/ఆసిఫాబాద్ అంబేద్కర్ చౌక్, సెప్టెంబర్ 1 : కాంట్రీబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్) విధానాన్ని రద్దు చేయాల్సిందేనని, ఓల్డ్ పెన్షన్ స్కీం(ఓపీఎస్)ను అమలు చేయాలని ఉద్యోగ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం మం చిర్యాల, ఆసిఫాబాద్ జిల్లా కేంద్రాల్లోని కలెక్టరేట్లు, బెల్లంపల్లి మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నాలు నిర్వహించి నిరసన తెలిపారు. జేఏసీ పిలుపు మేరకు సెప్టెంబర్ 1ని పెన్షన్ వ్యతిరేక దినంగా పాటిస్తూ ఐక్య ఉద్యోగ సంఘాల ఆధ్వర్వంలో సోమవారం మంచిర్యా ల కలెక్టరేట్ వరకు ర్యాలీ తీశారు.
నిరసన తెలిపి కలెక్ట ర్ దీపక్ కుమార్‌కు వినతి పత్రం అందజేశారు. ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్, టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు మా ట్లాడుతూ రెండు దశాబ్ధాలుగా ఎందరో ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయారని, సీపీఎస్ విధానం వల్ల వారి కుటుంబాలు నేడు దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నాయ ని ఆవేదన వ్యక్తం చేశారు. సీపీఎస్‌ను రద్దు చేసే వరకూ పోరాటం చేస్తామని హెచ్చరించారు. బెల్లంపల్లి మున్సిపల్ కార్యాలయం ఎదుట మున్సిపల్ మేనేజర్ ఎండీ మజార్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట ఉద్యో గ..ఉపాధ్యాయ జేఏసీ జిల్లా అధ్యక్షుడు లింగాల రాజశేఖర్ ఆధ్వర్యంలో ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. అనంతరం కలెక్టర్ వెంకటేశ్ధోత్రేకు వినతి పత్రం అందజేశారు. ధర్నాకు జిల్లా వైద్యాధికారి సీతా రాం మద్దతు తెలిపారు.
మంచిర్యాలలో.. జేఏసీ ఉద్యో గ సంఘాల జనరల్ సెక్రెటరీ వనజా రెడ్డి, పీఆర్టీయూ తెలంగాణ జిల్లా అధ్యక్షుడు ధరణి కోట వేణుగోపాల్, ప్రధాన కార్యదర్శి సూరినేని గంగాధర్, ఎస్టీయూటీఎస్ జిల్లా అధ్యక్షుడు పోకల వెంకటేశ్వర్లు, ప్రధాన కా ర్యదర్శి శంకర్ గౌడ్, టీఆర్ఈఎస్ఏ రాష్ట్ర నాయకుడు శ్రీనివాస్ రావ్ దేశ్‌పాండే, జిల్లా ప్రధాన కార్యదర్శి లా వుడ్య కృష్ణ, పీఆర్టీయూ టీఎస్ జిల్లా గౌరవ అధ్యక్షురా లు బండ శాంకరి, జిల్లా ప్రధాన కార్యదర్శి రాస రవి, డీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు అసంపెల్లి రమేశ్, ప్రధాన కా ర్యదర్శి మోతె జయకృష్ణ, టీఎన్జీవో రాష్ట్ర కార్యదర్శి పొ న్న మల్లయ్య, జిల్లా కార్యదర్శి సునీత,
మండల పంచాయతీ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీపతి బాపురావు, యుటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు చక్రపాణి, ప్ర ధాన కార్యదర్శి రాజువేణు, టీఎస్జేఎఫ్డీ కాళేశరం థర్డ్ జోన్ అధ్యక్షుడు అబ్దుల్ ఆజాబ్, తెలంగాణ నర్సిం గ్ ఆఫీసర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షురాలు రాజ్యలక్ష్మి, ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు గీట్ల సుమిత్, కార్యదర్శి గోవర్ధన్, 18 మండలాల ఉద్యోగులు, ఆసిఫాబాద్‌లో జేఏసీ నాయకులు శాంతికుమారి, ఉమర్ హుస్సేన్, ఊషన్న, హేమంత్ షిండే, ఏటుకూరి శ్రీనివాసరావు, తుకారాం, సదాశివ్, ఖమర్ హుస్సేన్, శ్రీపాద, వలి ఖాన్, భాగ్యలక్ష్మి పాల్గొన్నారు.