తాండూర్, ఏప్రిల్ 10 : గ్యాస్ ధర పెంపుపై సీపీఎం, సీపీఐ భగ్గుమన్నది. వెంటనే సిలిండర్ ధర తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలు చేపట్టింది. గురువారం తాండూర్ గ్రామ పంచాయతీలో సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో మహిళలు కట్టెల పొయ్యిపై వంట చేసి నిరసన తెలిపారు. సీపీఎం తాండూరు మండల కార్యదర్శి దాగం రాజారాం మాట్లాడుతూ కేంద్ర సర్కారు కార్పొరేట్లకు ఊడిగం చేసేందుకు ధరలు పెంచి పేదల నడ్డి విరుస్తున్నదని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో నాయకులు దశరథం, రాజేశం, పుష్ప, లక్ష్మి, సంఘవి, లక్ష్మీబాయి, తిరుపతమ్మ, లక్ష్మి, చిన్నక, సుమ, పాల్గొన్నారు.
నస్పూర్లో సీపీఐ రాస్తారోకో
సీసీసీ నస్పూర్, ఏప్రిల్ 10: గ్యాస్ ధర పెంపును నిరసిస్తూ నస్పూర్కాలనీలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద జాతీయ రహదారిపై సీపీఐ నాయకులు రాస్తారోకో నిర్వహించారు. రోడ్డుపై సిలిండర్లలతో నిరసన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీపీఐ పట్టణ కార్యదర్శి జోగుల మల్లయ్య, జిల్లా కార్యవర్గ సభ్యుడు మేకల దాసు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ధర రూ.50 పెంచడం దుర్మార్గమైన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు తగ్గుతుంటే.. ఇక్కడ కేంద్రం పెంచడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు లింగం రవి, మొగిలి లక్ష్మణ్, దొడ్డిపట్ల రవీందర్, తంగళ్లపల్లి సురేశ్, నర్సింగరావు, కొత్తపల్లి మహేశ్, లచ్చిరెడ్డి, హరీశ్, బాకం శంకరయ్య, లింగయ్య, మొగురం రాకేశ్, మేరుగు రాములు, రమేశ్, బత్తుల క్రాంతి పాల్గొన్నారు.