మంచిర్యాల, మే 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్లో ఓ అవినీతి తిమింగళం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నది. బర్త్, డెత్ సర్టిఫికెట్లు మొదలు.. ట్రేడ్ లైసెన్సుల జారీ, శానిటేషన్ పనులు.. ఇలా అన్నింటిలోనూ ఉన్నతాధికారులతో సంబంధం లేకుండా ‘వైకుంఠ’పాలి ఆట ఆడిస్తున్నది. నిబంధనలు పాతర పెట్టి ప్రతి నెలా రూ.6 లక్షల నుంచి రూ.7 లక్షల దాకా పక్కదారి పట్టిస్తున్నట్లు తెలుస్తున్నది. సంబంధం లేని పనుల్లో పెత్తనం తలకెత్తుకున్న సదరు అధికారి, అడిగితే ఓ ఎమ్మెల్యే పర్సనల్ అసిస్టెంటుతో పాటు ఇటీవల కార్పొరేటర్‌గా గెలిచిన ఓ అధికార పార్టీ నాయకుడికి వాటా ఉందంటూ ప్రచారం చేస్తూ, ఉన్నతాధికారులను సైతం గుప్పిట్లో పెట్టుకున్నారన్న విమర్శలుండగా, సదరు అధికారి అవినీతి పనులకు సంబంధించిన చిట్టా ‘నమస్తే’ చేతికి దొరికింది.
ప్రపంచంలో ఎక్కడ పుట్టినా, ఎక్కడ చనిపోయినా రూ.10 వేలిస్తే చాలు మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్లో బర్త్, డెత్ సర్టిఫికెట్లు జారీ చేయడమేగాక, మరో రూ. 10 వేలిస్తే పనై పోగానే వాటిని రద్దు కూడా చేయడం వీరి ప్రత్యేకత. ఒక బర్త్ లేదా డెత్ సర్టిఫికెట్ రావాలంటే సెక్షన్ క్లర్క్, హెల్త్ అసిస్టెంట్, అసిస్టెంట్ కమిషనర్, కమిషనర్ ఈ నలుగురి వేరిఫికేషన్ దాటుకొని రావాలి. కానీ, ఇక్కడ మాత్రం రూ.10 వేలిస్తే చాలు వచ్చిన దరఖాస్తుపై హెల్త్ అసిస్టెంట్ నోట్‌ఫైల్ తయారు చేయగానే.. ఆపరేటర్ నేరుగా సర్టిఫికెట్ జారీ చేస్తారు. కమిషనర్ సంతకంతో సర్టిఫికెట్ తీసి ఇస్తారు. కొసమెరుపు ఏమిటంటే కొన్నిసార్లు ఒరిజినల్ సర్టిఫికకెట్ కాకుండా ఫేక్ సర్టిఫికెట్ కూడా ఇస్తారు.
ఇలా.. బర్త్, డెత్ సర్టిఫికెట్లు అనే కాదు.. సదరు అధికారిపై ఎన్నో ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మున్సిపాలిటీలో గతంలోనే టెంపరరీ వర్కర్లుగా 60 మందిని తీ సుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన 99 రోజుల ప్రజాపాలన-ప్రగతి పాలన కోసమని మరో 90 మందిని అదనంగా తీసుకున్నారు. వీరికి ఒక్కొక్కరికీ రోజుకు రూ.600 చొప్పున చెల్లిస్తున్నట్లు చూపిస్తున్నారు. కానీ, రికార్డుల్లో ఉన్న సిబ్బంది ఫీల్డ్‌లో లేరన్న ఆరోపణలు సై తం వస్తున్నాయి. దాదాపు 15 మంద నుంచి 20 మం ది సిబ్బంది లేకున్నా, ఉన్నట్లు చూపించి ఆ బిల్లులు లేపుతున్నారని.. టెంపరరీ వర్కర్ల నుంచి వారి స్నే హితులు, కుటుంబ సభ్యుల వివరాలు తీసుకొని వారి బ్యాంక్ ఖాతాల్లోకి ఈ డబ్బులను మళ్లిస్తూ సొ మ్ము చేసుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి.
పైపె చ్చు రెగుల్యర్ వర్కర్లలో కొందరు విధులకు హాజరు కాకున్నా వారికి అటెండెన్స్ వేస్తూ వారి వద్ద నెలకు రూ.15 వేల నుంచి రూ.20 వేల కమీషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తున్నది. క్షేత్రస్థాయిలో ఆకస్మికంగా ఎప్పుడు తనిఖీ చేసినా ఈ విషయం బయటపడుతుందని పలువు రు మున్సిపల్ సిబ్బందే చెప్పడం గమనార్హం. సిబ్బంది విషయంలో ఇలా చే స్తూ లక్షలు దండుకుంటున్న సదరు అధికారి.. ట్రైడ్ లైసెస్సుల విషయంలోనూ చేతివాతం ప్రదర్శిస్తున్నారనే గుసగుస లు వినిపిస్తున్నాయి.
మంచిర్యాల ప్ర ముఖ హార్డ్‌వేర్ షాపు, బెల్లంపల్లి నుంచి వచ్చిన ఓ ప్రముఖ జువెల్లరీ షాపు, జిల్లాలో పేరుపొందిన ఓ ప్రైవేటు ప్రసూతి హాస్పిటల్.. ఇలా చెప్పుకుం టూ పోతే ఎన్నో ప్రముఖ షాపులు, హాస్పిటళ్లు ట్రైడ్ లైసెన్సులు రెన్యువల్ చేయకుండా డబ్బులు ఇస్తే చాలు ఎలాంటి సమ్యస రాకుండా సదరు అధికారి చక్రం తి ప్పుతున్నారని.. ఇలా ప్రతి నెలా రూ.6 లక్షల నుంచి రూ.7 లక్షల దాకా వెనకేస్తున్నారని తెలిసింది. ఇవేకాకుండా దోమల మందు పిచికారి, చెత్త సేకరణ వాహనాల డిజిల్లోనూ ఆయన చేతివాటం ప్రదర్శిస్తున్నార న్న ఆరోపణలున్నాయి. ఈ విషయం తెలిసిన కొందరు అధికారులు మేము చేయాల్సిన పనిలో నీ ప్రమేయం ఏమిటని నిలదీస్తే.. నా వెనుక ఓ ఎమ్మెల్యే పీఏ ఉన్నారని, ఇటీవల గెలిచిన అధికార పార్టీ కార్పొరేటర్ సైతం ఉన్నారని వాళ్లకు నెలనెలా వాటాలు ఇస్తున్నందుకే..
న న్ను బదిలీ చేయడం లేదని.. ఎక్కువ మాట్లాడితే ట్రాన్స్ఫర్ చేయిస్తానంటూ ఆయన రెచ్చిపోతున్నారని పలువురు వాపోతున్నారు. శానిటరీ సూపర్వైజర్, అసిస్టెం ట్ కమిషనర్, మున్సిపల్ కమిషనర్ ఇలా అందరూ వై కుంఠమాయ ముందు నిమిత్తమాత్రులుగా మారిపోయారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం లోజిల్లా ఉన్నతాధికారులు జోక్యం చేసుకోవాలని, బర్త్, డెత్ సర్టిఫికెట్ల కుంభకోణం వెలికి తీయడంతో పాటు టెంపరరీ సిబ్బంది, ట్రేడ్ లైసెన్సు రెన్యువల్స్, డీజిల్ అక్రమాలను గుర్తించి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.