ఇంద్రవెల్లి, నవంబర్ 22 ః ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో మొక్కజొన్న కొనుగోలు చేస్తున్నారు. ఈ మేరకు సమాచారం తెలుసుకున్న వివిధ గ్రామాలకు చెందిన రైతులు శనివారం ట్రాక్టర్లు, ఎడ్లబండ్లలో భారీ లోడింగ్‌తో తరలివచ్చారు. మార్కెట్ యార్డు మెయిన్ గేట్ నుంచి రోడ్డుకు ఓ పక్కన కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచాయి.
మార్క్‌ఫెడ్ ద్వారా మద్దతు ధర రూ.2400 కొనుగోలు చేస్తుంటే.. వ్యాపారస్తులు, దళారులు రూ.1700 నుంచి రూ.1800లకే కొనుగోలు చేస్తున్నారు. దీంతో రైతులు మార్కెట్ యార్డులోని ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో పంటను అమ్ముకోవడానికి తరలివస్తున్నారు. మంచి ధర లభించడం, తూకం వేయడంలో ఆలస్యం కావడంతో వాహనాలు భారీగా నిలిపోతున్నాయి.