ఆసిఫాబాద్ అంబేద్కర్ చౌక్ : నేరాల నియంత్రణకు కార్డెన్ సెర్చ్(Cordon search) నిర్వహించినట్లు సీఐ రవీందర్ ( CI Ravinder ) తెలిపారు. ఎస్పీ కాంతిలాల్ పాటిల్, ఏఎస్పీ చిత్తరంజన్ ఆదేశాల మేరకు శుక్రవారం తెల్లవారు జామున 5 గంటలకు జిల్లా కేంద్రంలోని భాగ్యనగర్ కాలనీలో కార్దెన్ సెర్చ్ నిర్వహించారు. ఈ తనిఖీలలో సరైన పత్రాలు లేని 40 ద్విచక్ర వాహనాలు, 4 ఆటోలు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.
కాలనీలో ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు కనపడితే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. గంజాయి, గుడుంబా, రేషన్ సరఫరా వంటి దృష్టికి వస్తే వెంటనే డయల్ 100 ను సంప్రదించాలని, లేదా నేరుగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని , సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని చెప్పారు. సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నలుగురు ఎస్సైలు, 30 మంది సిబ్బంది పాల్గొన్నారు.