కాసిపేట : మంచిర్యాల జిల్లా కాసిపేట మండల కేంద్రంలోని ధర్మారావుపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో శుక్రవారం అఖిల భారత సహకార వారోత్సవాలను ఘనంగా (Cooperative Week celebrations ) నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యాలయ ఆవరణలో సహకార సంఘం చైర్మన్ నీలా రాంచందర్ సహకార పతాకాన్ని ఆవిష్కరించారు.
రాంచందర్ మాట్లాడుతూ రైతుల అభివృద్ధి కోసం కృషి చేస్తామని తెలిపారు. రైతులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ సేవలు అందిస్తున్నామని తెలిపారు. రైతులు రుణాలను సద్వినియోగం చేసుకోవడంతో పాటు సంస్థ అభివృద్ధి ప్రతి ఒక్కరి సహకారం అందించాలని తెలిపారు. కార్యక్రమంలో సహకార సంఘం వైస్ చైర్మన్ తాటిపాముల శంకర్ గౌడ్, సీఈవో రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.