కాగజ్‌నగర్, జూలై 15: కాగజ్‌నగర్ పట్టణంలోని పెట్రోల్ పంపు ఏరియాలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో బుధవారం గ్యా స్ లీక్ అయి పెను ప్రమాదం తప్పింది. విద్యార్థుల కోసం మధ్యాహ్న భోజన కార్మికులు వంట చేస్తున్న క్రమంలో గ్యాస్ పైప్ లీక్ అవడంతో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. కార్మికులు భయపడి వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఫైరింజన్‌తో సిబ్బంది వచ్చి సకాలంలో మంటలను అదుపు చేశారు. జడ్పీ సెకండరీ పాఠశాలతో పాటు ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు పెను ప్రమాదం తప్పింది.