పూర్తయిన డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం
నిర్మల్, ఖానాపూర్, భైంసాలో అందుబాటులోకి 2060 గృహాలు
తుది దశకు లబ్ధిదారుల ఎంపిక
ఉగాది రోజున పంపిణీకి ముహూర్తం
నిర్మల్, మార్చి 25 (నమస్తే తెలంగాణ): నిర్మల్, ఖానాపూర్, భైంసా పట్టణాల్లో పూర్తయిన డబుల్ బెడ్రూం ఇండ్లను నిరుపేదలకు అందించేందుకు అధికార యంత్రాంగం కసరత్తు చేస్తున్నది. ఇప్పటికే ఇండ్లు పూర్తవగా, సాంకేతిక, పరిపాలనాపరమైన సమస్యలతో పాటు క్షేత్ర స్థాయిలో ఏర్పడ ్డ పలు ఇబ్బందుల కారణంగా పంపిణీ జరగలేదు. నిర్మాణాలు పూర్తయిన ఇళ్లలో ఇటీవల మున్సిపాలిటీల సహకారంతో తాగునీరు, మురుగు నీటి పారుదల వ్యవస్థ, రోడ్లు తదితర మౌలిక సదుపాయాలు సమకూర్చారు. ఇప్పటికే నిర్మల్, భైంసా, ఖానాపూర్ మున్సిపాలిటీల పరిధిలో ఇళ్లులేని నిరుపేదల నుంచి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించారు. ఇందులో నుంచి అర్హులైన వారిని గుర్తించేందుకు వార్డుల వారీగా సభలు నిర్వహించి డ్రా పద్ధతిలో లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. ఎంపికైన వారందరికీ ఉగాది రోజున ఇళ్లను పంపిణీ చేయాలని ఇప్పటికే జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ సంబంధిత అధికారులను ఆదేశించారు. ందుకోసం అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తున్నది.
2060 ఇండ్లు సిద్ధం
నిర్మల్ జిల్లాలోని మూడు ప్రధాన పట్టణాలైన నిర్మల్, ఖానాపూర్, భైంసాలో ఇప్పటి వరకు 20 60 ఇండ్ల నిర్మాణం పూర్తయింది. ఇక్కడ పూర్తి మౌలిక సదుపాయలతో కూడిన డబుల్ బెడ్రూం ఇళ్లు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. నిర్మల్ పట్టణానికి మొత్తం 2060 ఇండ్లు మంజూరు కాగా, పట్ట ణ శివారులోని బంగల్పేట్, నాగనాయిపేట ప్రాం తంలో 1460ఇళ్లు పూర్తయ్యాయి. అలాగే సిద్ధాపూర్ సమీపంలో మరో400 ఇళ్ల నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. నిర్మల్లో డబుల్ బెడ్ రూం ఇండ్ల కోసం మొత్తం 10755 దరఖాస్తులు రాగా, ఇప్పటికే అధికారులు దరఖాస్తుదారుల ఇండ్లకు వెళ్లి సర్వే నిర్వహించారు. 5507 మందిని అర్హులుగా గుర్తించారు. వీరిలో డ్రా పద్ధతిన లబ్ధిదారులను ఎంపిక చేసి ఇండ్లను పంపిణీ చేయనున్నారు. అలాగే ఖానాపూర్ పట్టణంలో 400 ఇండ్లు పూర్తయి పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. అలాగే భైంసా పట్టణ పేదల కోసం ప్రభుత్వం 800 డబుల్ బెడ్రూం ఇండ్లను మంజూరు చేయగా 200 ఇండ్లు పూర్తయ్యాయి. మరో 440 ఇండ్ల నిర్మాణపు పనులు తుది దశకు చేరుకున్నాయి. వీటిని కూడా త్వరలోనే పూర్తి చేసి రెండో విడుతలో అర్హులైన పేదలకు అందజేసేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. కాగా ఖానాపూర్, భైంసా పట్టణాల్లో పలువురు పేదల నుంచి ఇండ్ల కోసం దరఖాస్తులు రాగా వాటిపై సంబంధిత అధికారులు, సిబ్బంది స్క్రూటినీ చేస్తున్నారు. అర్హులను గుర్తించే పనిలో ఉన్నట్లు చెబుతున్నారు.
సదుపాయాల కోసం రూ.2కోట్లు ..
పట్టణంలోని పేదలకోసం బంగల్పేట్, నాగనాయిపేట్ వద్ద నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్ల వద్ద సకల సదుపాయాలు కల్పించాం. ఇందుకోసం మున్సిపాలిటీ నిధులు రూ.2కోట్లను వెచ్చించాం. వీటిలో విద్యుత్ సౌకర్యం కోసం ఆ శాఖకు రూ.25 లక్షలు, రోడ్ల నిర్మాణం కోసం రోడ్లు భవనాల శాఖకు రూ. 67లక్షలు చెల్లించడం జరిగింది. మిగతా నిధులను డ్రైనేజీల నిర్మాణం, తాగునీటి వస తి, భారీ సెప్టిక్ ట్యాంకుల నిర్మాణం మొదల గు మౌలిక వసతుల కల్పనకు ఖర్చు చేశాం. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కృషితో ఒకే చోట 1460 ఇళ్ల నిర్మాణం చేపట్టడంతో ఈ ప్రాం తం మోడల్ కాలనీగా రూపుదిద్దుకోనున్నది.
–గండ్రత్ ఈశ్వర్, నిర్మల్ మున్సిపల్ చైర్మన్