భీమారం : కాంగ్రెస్ నాయకులు, డీసీఎంఎస్ ( DCMS ) నిర్వాహకుల మూలంగానే ధాన్యం కల్లాల్లోనే ఉన్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మంచిర్యాల జిల్లా భీమారం మండల కేంద్రంలోని డీసీఎంఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ధాన్యం తరలించడం లేదని, ఇండ్లల్లో ఉన్న ధాన్యాన్ని తీసుకొని వెళ్తున్నారని ఆరోపించారు. అకాల వర్షాలతో కొన్ని రోజులుగా ధాన్యం తడుస్తూనే ఉందని పేర్కొన్నారు. దీంతో కల్లాలోనే ధాన్యానికి మొలకలు వచ్చాయని వెల్లడించారు. ప్రభుత్వం స్పందించి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు.