HomeAdilabadCongress Leader Blocks Minister Seethakka Vehicle
మార్కెట్ చైర్మన్ పదవి ఇవ్వండి
కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడిగా ఉన్న తనకు ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఇవ్వాలంటూ ఆ పార్టీ సీనియర్ నాయకుడు దర్శనాల చంటి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క వాహనాన్ని అడ్డుకున్నాడు.
మంత్రి వాహనాన్ని అడ్డుకున్న కాంగ్రెస్ నాయకుడు
ఆదిలాబాద్, ఏప్రిల్ 19(నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడిగా ఉన్న తనకు ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఇవ్వాలంటూ ఆ పార్టీ సీనియర్ నాయకుడు దర్శనాల చంటి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క వాహనాన్ని అడ్డుకున్నాడు. రెండు రోజులుగా జిల్లాలో పర్యటిస్తున్న మంత్రి సీతక్క శనివారం ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ కార్యక్రమానికి హాజరయ్యారు.
తిరిగి వెళ్తుండగా వాహనాన్ని అడ్డుకున్న చంటి ఎన్నో ఏళ్లుగా పార్టీకీ సేవలు అందిస్తున్న తనను కాదని జిల్లా నాయకులు ఇతరులకు పదవి ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ఆయనతో మాట్లాడిన మంత్రి తగు నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు.