కోటపల్లి : భీమారం గ్రామ పంచాయతీ కార్యదర్శి కృష్ణమూర్తి ( Secretary Krishnamurthy ) ఆకస్మిక మరణం పట్ల కోటపల్లి మండల అధికారులు, పంచాయతీ కార్యదర్శులు సంతాపం (Condolences) ప్రకటించారు. మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో కృష్ణ మూర్తి ఫొటోకు నివాళులు అర్పించి మౌనం పాటించారు. పంచాయతీ కార్యదర్శిగా కృష్ణ చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో లక్ష్మయ్య, ఏపీవో వెంకటేశ్వర్లు, పంచాయతీ కార్యదర్శులు, ఎంపీడీవో కార్యాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.