దండేపల్లి, జూన్18 : ఇరాన్-ఇజ్రాయెల్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధంలో తెలంగాణ ప్రాంతంలోని మంచిర్యాల జిల్లావాసు లు బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని గడుపుతున్నారు. ఏ క్షణంలో ఎటువైపు నుంచి రాకెట్లు, లాంచర్లు దూసుకొస్తాయోనని వణికిపోతున్నారు. ఇటీవల జగిత్యాలకు చెందిన రవీందర్ బాంబుల దాడికి గుం డెపోటుకు గురై మృతిచెందాడు. వందలాది మంది అక్కడి దేశస్థులు మృతి చెందుతున్న ట్లు టీవీల్లో, సోషల్ మీడియాలో వార్తలు వె లువడడంతో ప్రవాసీ భారతీయుల కుటుంబ సభ్యుల్లో ఆందోళన నెలకొంది. దండేపల్లితో పాటు జన్నారం, లక్షెట్టిపేట, తదితర ప్రాంతాలకు చెందిన సుమారు 100 మందికి పైగా పారిశ్రామిక, నిర్మాణ, ఉపాధి రంగాల్లో, ఇండ్లల్లో పనులు చేస్తున్నారు.
సైరన్ మోగగానే బంకర్లలోకి వెళ్తున్నాం
ఉపాధి కోసమని వెళ్లిన దండేపల్లి మండలం తాళ్లపేట, గుడిరేవు, జన్నారం మండలం త పాల్పూర్, రోటిగూడ గ్రామాలకు చెందిన బ్ర హ్మయ్య, రమేశ్, సతీశ్ అక్కడి పరిస్థితిని వివరిస్తూ ‘నమస్తే’తో ఫోన్లో మాట్లాడారు. ఇ జ్రాయెల్లోని యెల్కానా ప్రాంతంలో ని వాసముంటున్న వారంతా క్షేమంగానే ఉన్నట్లు తెలిపారు.ఇరాన్ ఎదురుదాడులతో ఇజ్రాయె ల్లోని మన పౌరులు ఉలికిపాటుకు గురవుతున్న మాట వాస్తవమేనన్నారు.
గత 4, 5 రోజుల నుంచి బాంబుల దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో బంకర్లలో తలదాచుకుంటున్నామన్నారు.10-15నిమిషాల ముందు సైరన్ మోగిస్తున్నారని, అప్రమత్తమై వెంటనే బంకర్లలోకి వెళ్లిపోతున్నామన్నారు. ఇండియన్ ఎంబసీ కూడా ఎప్పటికప్పుడు అప్రమ త్తం చేస్తుందని, సేఫ్టీ జోన్లో ఉండాలని సూ చిస్తుందన్నారు.ఇప్పటి వరకైతే కార్మికులకు సెలవులు ప్రకటించారన్నారు. ఈనెల 30 వరకు దేశ వ్యాప్తంగా ఎమర్జెన్సీ విధించినట్లు తెలిపారు.