మంచిర్యాల అర్బన్, జనవరి 25 : ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ భారం కాదు-భద్రత అని రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ అన్నారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా హెల్మెట్‌తో ప్రాణానికి భద్రత అని అవగాహన కల్పిస్తూ మంచిర్యాల పట్టణంలో శనివారం ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో మహిళలు, సీనియర్ సిటిజన్స్, మున్సిపల్ సిబ్బందికి 150 హెల్మెట్లను డీసీపీ భాస్కర్, ఏసీపీ ప్రకాశ్, ట్రాఫిక్ ఏసీపీ నరసింహులుతో కలిసి పంపిణీ చేశారు.
ఏదో ఒక రకంగా ప్రమాదానికి గురై ద్విచక్రవాహనదారులు ప్రాణాలు కోల్పోతున్నారని, ఇలా చనిపోతున్నవారిలో ఎకువగా హెల్మెట్ లేకుండా ప్రయాణించేవారేనని సీపీ తెలిపారు. హెల్మె ట్ల స్పాన్సర్, ట్రస్మా జిల్లా అధ్యక్షుడు ఎంజీ అజీజ్, మంచిర్యాల పట్టణాధ్యక్షుడు కొమ్ము దుర్గాప్రసాద్, వైస్ ప్రెసిడెంట్ ఉస్మాన్ పాషా, మందమర్రి జనరల్ సెక్రటరీ లతశ్రీ, మంచిర్యాల కళాశాలల ప్రెసిడెంట్ రమణను సీపీ సతారించి, అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల పట్టణ సీఐ ప్రమోద్‌రావు, ట్రాఫిక్ సీఐ సత్యనారాయణ మంచిర్యాల రూరల్ సరిల్ సీఐ అశోక్ కుమార్, ఎస్ఐలు, సిబ్బంది ఉన్నారు.
ప్రాపర్టీ నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీపీ శ్రీనివాస్ అన్నారు. పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి, మంచిర్యాల జోన్ పరిధిలోని డీసీపీ, ఏసీపీ, ఇతర అధికారులతో ఆన్లైన్ జూమ్ మీటింగ్ ద్వారా పలు కేసుల పరిషారంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. పోలీస్ స్టేషన్ల వారీగా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రణాళిక ఏర్పాటు చేసుకోవాలని, దాని గురించి రివ్యూ చేసి ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పలు కేసుల గురించి చర్చించారు.