నస్పూర్, నవంబర్ 20 : జిల్లాలో వరిధాన్యం కొనుగోలు పక్రియను పకడ్బందీగా చేపట్టాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ దేవేంద్రసింగ్ చౌహాన్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో కలెక్టర్ కుమార్‌దీపక్, అదనపు కలెక్టర్ మోతీలాల్‌తో కలిసి అధికారులతో సమావేశం నిర్వహించారు.
ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోగా రైతు ఖాతాల్లో డబ్బులు జమ చేయాలన్నారు. తేమ శాతం, తాలు తరుగు లేకుండా చూసుకోవాలని, నిబంధనలను తప్పనిసరిగా పాటించేలా రైతులకు అవగాహన కల్పించారు. జిల్లాలో 303 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినట్లు కలెక్టర్ తెలిపారు.