ఎదులాపురం, ఫిబ్రవరి 5 : మావల శివారులోని సర్వే నంబర్ 170 పరిధిలో గల కుమ్రం భీం కాలనీవాసులకు సౌకర్యాలు కల్పించాలని తుడుందెబ్బ రాష్ట్ర కో-కన్వీనర్ గోడం గణేశ్ డిమాండ్ చేశారు. బుధవారం కాలనీ నుంచి హెడ్ పోస్టాఫీసు వరకు పాదయాత్రగా వచ్చారు. ఇకడి నుంచి ప్రెసిడెండ్ ఆఫ్ ఇండియా, ప్రధాన మంత్రి, ఎస్టీ కమిషన్, తెలంగాణ గవర్నర్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, తెలంగాణ సీఎంలకు పోస్టు కార్డులను పంపించారు. సమస్యలను వివరిస్తూ.. పరిషరించేలా చూడాలని కార్డు ద్వారా కోరారు.
ఈ సందర్భంగా గణేశ్ మాట్లాడుతూ.. పట్టణంలో అడవి బిడ్డలు ఆవాసం ఏర్పాటు చేసుకున్నారన్నారు. పాలకులు, అధికారులు వారికి సౌకర్యాలు కల్పించడం లేదన్నారు. ఏడు దశాబ్దాల నుంచి అకడే గుడిసెలు వేసుకుని ఉంటున్నా తమను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. పిల్లల భవిష్యత్ కోసం ఆదివాసులకు ఇండ్ల పట్టాలతోపాటు రోడ్డు, విద్యుత్, విద్య, తాగు నీరు వంటి సౌకర్యాలు కల్పించాలని కోరారు. ఎండ్లుగా పోరాడం చేస్తున్న సమస్యను పరిషరించడం లేదన్నారు. అందుకే పోస్టు కార్డుల ద్వారా తమ సమస్యలను తెలిపామని వివరించారు. ఈ కార్యక్రమంలో వెట్టి మనోజ్, దాదిరావ్, సుబన్, రేణుక, వరుణ్, ఇంద్ర, సంతోష్, భజంగ్రావ్ పాల్గొన్నారు.