రెబ్బెన, జూలై 25 : పర్యవరణ పరిరక్షణలో అందరు భాగస్వాములు కావాలని కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ వెంకటేశ్ దౌత్రే, జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు, డీఎఫ్‌వో నీరజ్‌కుమార్, బెల్లంపల్లి ఏరియా జీఎం రవిప్రసాద్ లు పిలుపునిచ్చారు. బెల్లంపల్లి ఏరియా లోని ఖైర్గూడ ఓసీపీలో వన మహోత్సవం కార్యక్రమం నిర్వహించగా ముఖ్య అతిథిగా హజరై మొక్కలు నాటిన అనంతరం మాట్లాడారు. మొక్కలు నాటడం ద్వారా భవిషత్తు తరాలకు మంచి చేసిన వారు అవుతారని అన్నారు. పర్యవరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరు భాగం కావాలని భవిషత్తు తరాలకు ఆరోగ్యకరమైన పర్యవరణం అందించటం కొసం కృషి చేయాలని కొరారు. చెట్లు, అడవులు లెకపొతే వర్షాలు పడక దుర్బర పరిస్థితులు ఎదుర్కోవలసి వస్తుందన్నారు. ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటిని పరిరక్షించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయుసీ గోలేటి బ్రాంచి కార్యదర్శి ఎస్.తిరుపతి, ఏరియా ఎస్వోటూజీఎం మచ్చగిరి నరేందర్, సీఎంవోఏఐ అధ్యక్షుడు మధుసుదన్, ప్రాజెక్టు అధికారులు సత్యనారాయణ, ఉమాకాంత్ లతో పాటు పలువురు అధికారులు ఉన్నారు.