ఆసిఫాబాద్ అంబేదర్ చౌక్, ఫిబ్రవరి 14 : ప్రధానమంత్రి శ్రీ పథకం కింద ఎంపికైన పాఠశాలల్లో అభివృద్ధి పనులు వేగంగా చేపట్టి మార్చి నెలాఖరుకల్లా పూర్తి చేయాలని కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) దీపక్ తివారీతో కలిసి ప్రధానమంత్రి శ్రీ పథకం కింద ఎంపికైన 18 విద్యాలయాల ప్రధానోపాధ్యాయులతో పాటు ప్రత్యేకాధికారులు, ఇంజినీరింగ్, విద్యాశాఖ అధికారులతో పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ పాఠశాలల్లో అదనపు గదులు, మూత్రశాలలు, ప్రహరీ నిర్మాణం, తాగునీటి సౌకర్యం, సైన్స్ ల్యాబ్, ఫ్యాన్లు, సీసీ కెమెరాలవంటివి ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రణాళిక సమన్వయకర్త అబిద్ అలీ, తదితరులు పాల్గొన్నారు.
మెదక్ -నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ నియోజకవర్గాల ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిల్లో అర్హులందరూ ఓటు హకు వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 27న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని, ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రభుత్వ ఉద్యోగులకు పోలింగ్ రోజు సెలవు దినంగా ప్రకటించారని పేర్కొన్నారు.