ఎదులాపురం, ఏప్రిల్ 20 : సోమవారం సివిల్ సర్వీసెస్ డే సందర్భంగా పీఎం నరేంద్ర మోదీ చేతుల మీదుగా అవార్డును కలెక్టర్ రాజర్షి షా అందుకొన్నారు. జిల్లా అడ్మినిస్ట్రేషన్లో భాగంగా నార్నూర్ బ్లాక్ అస్పరేషనల్ ప్రొగ్రాం 2024కు గాను ఈ అవార్డుకు ఎంపికయ్యారు. ప్రధాన మంత్రి ప్రజాస్వామ్య పరిపాలన ఉత్తమ పురసారం 2024లో నార్నూర్ బ్లాక్ దేశంలో టాప్ ఐదవ స్థానంలో నిలిచింది.
ఈ సందర్భంగా కలెక్టర్ రాజర్షి షా జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక, పార్లమెంట్ సభ్యులు గొడెం నగేశ్, ఎమ్మెల్యేలు, శాసనమండలి సభ్యులు, ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి ఖుష్బూ గుప్తా, ఆయా శాఖల జిల్లా అధికారుల సహకారంతో ఈ అవార్డు లభించిందని, ఈ సందర్భంగా సహకరించిన ప్రతి ఒకరికీ ధన్యవాదాలు తెలిపారు.