నస్పూర్, జూన్ 22 : మహిళా శక్తి ద్వారా ఆర్థిక స్వావలంబనకు కృషి చేస్తామని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శనివారం నస్పూర్‌లోని కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ రాహుల్, డీఆర్డీవో కిషన్‌తో కలిసి అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ మహిళా శక్తి పథకంలో మైక్రో ఎంటర్ ప్రైజెస్ విభాగంలో 5684 మందికి రూ. 64.73 కోట్లు, స్ట్రిచ్చింగ్ సెంటర్ల విభాగంలో 618 మందికి రూ. 2.35 కోట్లు, పాడి పశువుల విభాగంలో 500 మందికి రూ. 4.50 కోట్లు,
బ్యాక్యార్డు ఫౌల్ట్రీ విభాగంలో 2 వేల మందికి రూ. 3 కోట్లు, ఫౌల్ట్రీ మదర్ యూనిట్ల విభాగంలో 16 మందికి రూ. 46 లక్షలు, మిల్క్ పార్లర్ల విభాగంలో ఒక్కొక్కరికీ రూ. 1.90 లక్షలు, మీ సేవ విభాగంలో 20 మందికి రూ. 50 లక్షలు, ఈవెంట్ మేనేజ్మెంట్ విభాగంలో 21 మందికి రూ. 31 లక్షలు, ఫుడ్‌ప్రాసెసింగ్ యూనిట్ల విభాగంలో 200 మందికి రూ. 4 కోట్లు అందించేందుకు కార్యచరణ రూపొందించినట్లు తెలిపారు. జిల్లాలోని 16 మండలాల్లో కార్యచరణ ప్రకారం లక్ష్యాలను సాధించేలా అధికారులు సమన్వయంతో కృషి చేయాలన్నారు.