హాజీపూర్, సెప్టెంబర్ 02 : భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు ఆందోళన చెందవద్దని కలెక్టర్ కుమార్‌దీపక్ అన్నారు. సోమవారం గుడిపేట శివారులోని ఎల్లంపల్లి ప్రాజెక్టును ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు, డీసీపీ ఎగ్గడి భాస్కర్, ఏసీ పీ ప్రకాశ్‌తో కలిసి పరిశీలించారు. కలెక్టర్ మా ట్లాడుతూ భారీ వర్షాల నేపథ్యంలో నెలకొన్న వరద పరిస్థితులకు ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, అధికార యంత్రాంగం అం దుబాటులో ఉంటూ అత్యవసర సేవలను అందిస్తుందని తెలిపారు.
ప్రజల సౌకర్యార్థం కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ 08736-250501ను ఏర్పాటు చేశామని, అత్యవసర సమయాల్లో ప్రజలు సంప్రదించవచ్చునని తెలిపారు. మంచిర్యాల ఎమ్మెల్యే మాట్లాడు తూ కడెం, శ్రీరాంసాగర్ నుంచి నీటిని విడుదల చేయడంతో వరద ఉధృతి పెరిగిందని, ఈ నేపథ్యంలో ముందస్తు చర్యలు చేపడుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్ రావ్ దేశ్ పాండే, ఎంపీడీవో మధుసూదన్, ఎంపీవో శ్రీనివాస్ రెడ్డి, మండల అధ్యక్షుడు తోట రవి, నాయకుడు శ్రీనివాస్‌గౌడ్, ప్రాజెక్టు ఏఈలు, ఇంజినీర్లు ఉన్నారు.