దండేపల్లి, సెప్టెంబర్16 : పర్యావరణాన్ని కాపాడుకునేందుకు ఇంటింటికీ సోలార్ విద్యుత్ సరఫరా చేస్తామని కలెక్టర్ కుమార్‌దీపక్, ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు అన్నారు. సోమవారం వెల్గనూర్‌లో సౌర విద్యుత్ ఉత్పత్తి పైలట్ ప్రాజెక్టు రూపకల్పన కార్యక్రమానికి హాజరయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ వెల్గనూర్ గ్రామంలో సోలార్ పవర్ ప్రాజెక్టు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ఆధ్వర్యంలో నియోజకవర్గానికి రూ.30 కోట్లు కేటాయించి పాఠశాలల అభివృద్ధికి కృషి చేస్తామన్నారు.
మండలంలోని కస్తూర్బా గాంధీ విద్యాలయంలో మూడు అదనపు గదులు, వంట, భోజనశాలలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. అనంతరం గ్రామంలో పర్యటించి వ్యవసాయ మోటార్లు, నివాస ప్రాంతాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ట్రైకార్ చైర్మన్ కోట్నాక తిరుపతి, మార్కెట్ కమిటీ చైర్మన్ దాసరి ప్రేమ్‌చంద్, వైస్ చైర్మన్ ఆరీఫ్, ఎస్ఈ శ్రావణ్‌కుమార్, తహసీల్దార్ సంధ్యారాణి, ఎంపీడీవో ప్రసాద్, మాజీ సర్పంచ్ శంకరయ్య, తదితరులు ఉన్నారు.