జైనూర్, ఆగస్టు 30 : జైనూర్ మండలం పాట్నాపూర్ సిద్ధేశ్వర సంస్థాన్ లో భక్తులకు సకల సౌకర్యాలు కల్పిస్తామని కుమ్రం భీం ఆసిఫాబాద్ కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవరావు, జడ్పీ చైర్పర్సన్ కోవ లక్ష్మి, ఎమ్మెల్యే ఆత్రం సక్కు అన్నారు. సిద్ధేశ్వర సంస్థాన్‌లో పరమహంస సద్గురు పులాజీ బాబా 99వ జన్మదిన వేడుకల్లో వారు పాల్గొని, ప్రసంగించారు. రాబోయే రోజుల్లో ఎమ్మెల్యే ఆత్రం సకుతో కలిసి భక్తులకు సకల సౌకర్యాలతో పాటు, రోడ్డు సౌకర్యం, మంచినీటి సదుపాయం కల్పించేందుకు నిధులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రితో విజ్ఞప్తి చేస్తామన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ.. గతంలో కంటే ఇకడ అభివృద్ధి గణనీయంగా కొనసాగుతున్నదని, ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామన్నారు. భక్తులు ఆధ్యాత్మిక మార్గంలో పయనించినప్పుడే నలుమూలల శాంతి సద్భావన మెరుగుపడుతుందని పేర్కొన్నారు. పీవో చాహత్ బాజ్‌పాయ్ మాట్లాడుతూ.. సంస్థాన్‌లో ఐటీడీఏ తరఫున అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు కృషిచేస్తామన్నారు.
బాబా జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించినందుకు కమిటీ సభ్యులను అభినందించారు. జడ్పీ చైర్పర్సన్ మాట్లాడుతూ.. భక్తుల కోసం అనేక సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వపరంగా కృషి చేస్తామన్నారు. ఎమ్మెల్యే సకు మాట్లాడుతూ.. సంస్థాన్‌లో ప్రభుత్వ ఇప్పటికే అనేక సదుపాయలు కల్పించిందన్నారు. అంతకుముందు ధ్యాన కేంద్రంలో జడ్పీ చైర్పర్సన్, కలెక్టర్, ఎమ్మెల్యే, ఐటీడీఏ పీవో, అదనపు కలెక్టర్ దీపక్ తివారీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరాన్ని అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రారంభించారు. తెలంగాణతో పాటు మహారాష్ట్ర నుంచి ప్రత్యేక వైద్య నిపుణులు రోగులకు పరీక్షలు చేసి, మందులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సంస్థాన్ చైర్మన్ కేశవరావు, గౌరవ అధ్యక్షుడు రామారావ్, మాజీ ఎంపీ రాథోడ్ రమేశ్, మహారాష్ట్ర మాజీ మంత్రి శివాజీ రావ్ మోగే, మహారాష్ట్ర మాజీ ఎమ్మెల్యేలు ఉత్తమ ఇంగ్లే, తార్పే కమిటీ సభ్యులు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కనక యాధవరావ్, కార్యదర్శి మగాడే దాదా రావు, మగాడి ప్రకాశ్, కోశాధికారి సుభాష్, జనార్దన్ కందారి నారాయణ, మాను, రామారావు, మారుతి, అత్రం మారుతీ, సర్పంచ్ కందరె బాలాజీ, సుభాష్ డుక్రే, ఎంపీపీ కుమ్ర తిరుమల విశ్వనాథ్, వైస్ ఎంపీపీ చిర్లె లక్ష్మణ్, ఎంపీటీసీలు భగవంతురావ్, జుగాధి రావ్, నాయకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.