ఓటరు జాబితా సవరణ పకడ్బందీగా నిర్వహించాలి
ఓటరు జాబితా సవరణ కార్యక్రమం -2024ను పకడ్బందీ గా నిర్వహించాలని కలెక్టర్ బొరడే హే మంత్ సహదేవరావు అన్నారు. జిల్లా కేం ద్రంలోని కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో బుధవారం ఆసిఫాబాద్, కాగజ్ న గర్ ఆర్డీవోలు కదం సురేశ్, కాసబోయిన సు రేశ్లతో కలిసి వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఓటరు జాబితా సవరణ పై సమీక్ష సమావేశం నిర్వహించారు.
- కుమ్రం భీం జిల్లా కలెక్టర్ బొరడే హేమంత్ సహదేవరావు
ఆసిఫాబాద్,జనవరి 3: ఓటరు జాబితా సవరణ కార్యక్రమం -2024ను పకడ్బందీ గా నిర్వహించాలని కలెక్టర్ బొరడే హే మంత్ సహదేవరావు అన్నారు. జిల్లా కేం ద్రంలోని కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో బుధవారం ఆసిఫాబాద్, కాగజ్ న గర్ ఆర్డీవోలు కదం సురేశ్, కాసబోయిన సు రేశ్లతో కలిసి వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఓటరు జాబితా సవరణ పై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సవరణ కార్యక్రమాన్ని అధికారులు, రాజకీయ పార్టీల నాయకులు సమన్వయంతో పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. పార్లమెంట్ ఎన్నికల కో సం సిర్పూర్ నియోజకవర్గ పరిధిలో 27, ఆ సిఫాబాద్ నియోజకవర్గ పరిధిలో 52 సహాయక పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈనెల 20, 21వ తేదీల్లో పోలింగ్ కేంద్రాల ఏర్పాటుపై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తామని చె ప్పారు. ఎన్నికల విభాగం అధికారులు, రా జకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.
దరఖాస్తు చేసుకోవాలి
గురుకుల పాఠశాలల్లో ఐదో తరగతిలో ప్రవేశానికి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ బొరడే హేమంత్ సహదేవరావు అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సముదాయంలో బుధవారం సాంఘిక సంక్షేమ గురుకులాల అధికారులతో కలిసి ప్రవేశ పరీక్ష సంబంధిత వాల్పోస్టర్లను ఆవిషరించారు. ఫిబ్రవరి 11న నిర్వహించే ఈ ప్రవేశ పరీక్ష కోసం ఆన్లైన్లో ఈ నెల 6వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వివరాలకు హెల్ప్ లైన్ నంబర్ 1800 425 45678లో సంప్రదించాలని కోరారు. సాంఘిక సంక్షేమ గురుకులాల ఆర్సీవో స్వరూపారాణి, డీసీవో బాలరాజు, ప్రిన్సిపాళ్లు సంధ్యారాణి, జ్యోతి, శ్రీనాథ్, సంగీత తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

