‘జన్మన్’తో గిరిజనుల అభ్యున్నతి
ప్రధానమంత్రి జన్జాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ (జన్మన్) పథకం ద్వారా గిరిజనుల అభ్యున్నతికి కృషి చేస్తున్నట్లు కలెక్టర్ బోరడే హేమంత్ సహదేవరావు, ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు.
- కలెక్టర్ బోరడే హేమంత్ సహదేవరావు, ఎమ్మెల్యే కోవ లక్ష్మి
ఆసిఫాబాద్ అంబేదర్చౌక్, జనవరి 16 : ప్రధానమంత్రి జన్జాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ (జన్మన్) పథకం ద్వారా గిరిజనుల అభ్యున్నతికి కృషి చేస్తున్నట్లు కలెక్టర్ బోరడే హేమంత్ సహదేవరావు, ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. సోమవారం దేశవ్యాప్తంగా జన్మన్ పథకం ప్రారంభించిన సందర్భంగా జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్లు దీపక్ తివారీ, దాసరి వేణు, జిల్లా అధికారులు, ఆదివాసులతో సమావేశం నిర్వహించారు.
కలెక్టర్, ఎమ్మెల్యే కోవ లక్ష్మి మాట్లాడుతూ జిల్లాలోని 149 గ్రామాల్లో గృహ నిర్మాణాలు, స్వచ్ఛమైన తాగునీరు, పారిశుధ్యం, మెరుగైన విద్య, పోషకాహారం, విద్యుత్, రహదారులు, టెలికాంవంటి ప్రాథమిక సౌకర్యాలు కల్పించనున్నట్లు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందేలా చూస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి శ్రీనివాస్, ఎంపీపీ అరిగెల మల్లికార్జున్, రెబ్బెన జడ్పీటీసీ సంతోష్, జిల్లా ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

