మంచిర్యాల అర్బన్, మార్చి 7 : ఆత్మ ైస్థెర్యమే మహిళల ఆయుధమని, దేశ ప్రథమ పౌరురాలి స్థానంతో పాటు మంత్రులు, ఐఏఎస్, ఐపీఎస్, ఆర్మీ, నేవి, ఎయిర్‌ఫోర్స్, శాస్త్రవేత్తలుగా ఇలా అన్ని రంగాల్లో రాణిస్తున్నారని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. గురువారం కలెక్టరేట్లో జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, జిల్లా సంక్షేమ అధికారి కొట్టె చిన్నయ్య, డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖతో కలిసి హాజరయ్యారు.
కలెక్టర్ మాట్లాడుతూ మహిళలు సామాజికంగా ఎంతో తోడ్పాటు అందిస్తున్నారన్నారు. అనంతరం జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన లింగ నిర్ధారణ పరీక్షల నిషేధానికి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం ప్రతిభ కనబర్చిన మహిళా అధికారులు, ఉద్యోగులను ప్రశంసా పత్రాలతో సత్కరించారు. ముగ్గుల పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు. అనంతరం దివ్యాంగులకు ప్రభుత్వం మం జూరు చేసిన మోటారు సైకిళ్లను పంపిణీ చేశారు.
హాజీపూర్, మార్చి 8 : మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని జడ్పీ చైర్పర్సన్ భాగ్యలక్ష్మి అన్నారు. గురువారం జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకలకు హాజరై మాట్లాడారు. అనంతరం జడ్పీ చైర్పర్సన్ పలువురు మహిళా జడ్పీటీసీలు, ఉద్యోగులను శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో గణపతి, కార్యాలయ సూపరింటెండెంట్లు బాలకృష్ణ, సత్యనారాయణ, శ్రీనివాస్, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
దేశ ప్రగతి మహిళా సాధికారతపైనే ఆధారపడి ఉందని హాజీపూర్ మండల పరిషత్ అధ్యక్షురాలు మందపెల్లి స్వర్ణలత పేర్కొన్నారు. గురువారం మం డల పరిషత్ కార్యాలయంలో మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. అనంతరం ఎంపీటీసీలను, ఎంపీడీవో కార్యాలయ సిబ్బంది, ఈజీఎస్ కార్యాలయ సిబ్బందిని శాలువా, మెమొంటోతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ స్వర్ణలత, వైస్ ఎంపీపీ బేతు రమాదేవి, ఎంపీడీవో మధుసూదన్, ఎంపీవో శ్రీనివాస్ రెడ్డి, ఈజీఎస్ ఏపీవో మల్లయ్య, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
దండేపల్లి, మార్చి7: మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని ఎంపీపీ గడ్డం శ్రీనివాస్ అన్నారు. దండేపల్లిలోని మండల పరిషత్ కార్యాలయంలో మహిళా దినోత్సవం మహిళా ఉద్యోగులను సన్మానించారు. దండేపల్లి జీపీ కార్యాలయంలో వేడుకల్లో భాగంగా జీపీ కార్యదర్శి శ్రీలత, పారిశుధ్య కార్మికురాలిని శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సంధ్యారాణి, ఎంపీడీవో ప్రసాద్, ఎంపీవో శ్రీనివాస్, డిప్యూటీ తహసీల్దార్ విజయ, ఉద్యోగులు పాల్గొన్నారు.
మంచిర్యాల అర్బన్, మార్చి 7 : మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని లక్ష్మీనగర్‌లోని చైతన్య పాఠశాలలో గురువారం విద్యార్థుల తల్లులకు ఆటల పోటీలు నిర్వహించారు. విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ అయూబ్, డీన్ రమేశ్, ప్రైమరీ పాఠశాల ఇన్చార్జి ఆసియా, ప్రీ ప్రైమరీ ఇన్చార్జి ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు తదితరులున్నారు.
అంజనీ పుత్ర సంస్థ ఆధ్వర్యంలో.. మహిళలు రాజకీయ, ఆర్థిక, సామాజికంగా అన్ని రంగాల్లో రాణించాలని అంజనీ పుత్ర సంస్థ చైర్మన్ గుర్రాల శ్రీధర్ అన్నారు. అంజనీపుత్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎండీ పిల్లి రవితో కలిసి మాట్లాడారు. అనంతరం మహిళలతో కలిసి కేక్ కట్ చేశారు. మహిళలను సత్కరించారు. ఈ కార్యక్రమంలో అంజనీ పుత్ర ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు కిషన్, సంతోష్, డైరెక్టర్లు పాల్గొన్నారు.
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో.. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్ డాక్టర్ వీ చక్రపాణి అధ్యక్షతన నిర్వహించిన వేడుకల్లో అడ్వొకేట్ శిల్ప, మహిళా సాధికారత విభాగం కో ఆర్డినేటర్ ప్రేమలత, నాక్ కో ఆర్డినేటర్ డీ రామకృష్ణ, అధ్యాపకులు కిశోర్ కుమార్, సీహెచ్ శ్రీనివాస్, రాజశేఖరం, జాడి మహేష్ కుమార్, కే రాజయ్య, కనకలక్ష్మి, రసూల్, విద్యార్థులు తదితరులున్నారు.
మంచిర్యాలటౌన్, మార్చి 7: మంచిర్యాల మున్సిపాలిటీలోని ఐదోవార్డుకు చెందిన 20 మంది మహిళా పారిశుధ్య కార్మికులను సన్మానించారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని కాంగ్రెస్ నాయకుడు సుదమల్ల అశోక్‌తేజ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు పెంట రజిత, పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు హేమలత, మాజీ కౌన్సిలర్ పూదరి ప్రభాకర్ పాల్గొన్నారు. మహిళా కార్మికులను మహిళా సన్మానించి, వారి చీరెలను బహూకరించారు. ఈ కార్యక్రమంలో వార్డు నాయకులు ఆవునూరి రవి, బొజ్జ శేఖర్, సుదమల్ల కృష్ణ, కొప్పుల తిరుపతి, అక్షయ్, తదితరులున్నారు.
కోటపల్లి, మార్చి 7 : ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో ఎంపీపీ మంత్రి సురేఖతో పాటు మహిళా ఉద్యోగులను శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ సూపరింటెండెంట్ లక్ష్మయ్య, సీనియర్ అసిస్టెంట్ స్మిత, ఆశ్రమ స్కూల్ హెచ్ఎం లావణ్య, కేజీబీవో ఎస్వో హరిత, వైద్య, సెర్ప్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
భీమారం, మర్చి 7 : మండల కేంద్రంలో మంచిర్యాల లయన్స్‌క్లబ్ గౌతమి ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో ఎంపీడీవో రాధా రాథోడ్‌తో పాటు కార్యాలయ సిబ్బందికి, పంచాయతీ కార్యదర్శులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఖాజీపల్లి ఎంపీటీసీ పెద్దల రూప, నాయకులు ఉష్కమల్ల చందు, ఉష్కమల్ల సదాశివ, ఉష్కమల్ల శ్రీనివాస్, పోడెటి రవి తదితరులు పాల్గొన్నారు.
తాండూర్, మార్చి 7 : తాండూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో మహిళా పారిశుధ్య కార్మికులను జడ్పీటీసీ సాలిగామ బానయ్య, తాండూర్ ప్రత్యేకాధికారి, ఎంపీడీవో పీ శ్రీనివాస్ సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు సిరంగి శంకర్, పెర్క రజిత, మండల కో ఆప్షన్ మెంబర్ రహమత్ ఖాన్, పంచాయతీ కార్యదర్శి తపాస్కుమార్, అంగన్వాడీ టీచర్లు, గ్రామ పంచాయతీ సిబ్బంది ఉన్నారు.
వేమనపల్లి, మార్చి 7 : మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో చామనపల్లి పంచాయతీలో మహిళా పారిశుధ్య కార్మికురాలు జాడి విజయను ఎంపీపీ కోలి స్వర్ణలత , జడ్పీటీసీ ఆర్. స్వర్ణలత, ఎంపీవో బాపురావు సన్మానించారు. ఎంపీపీ, జడ్పీటీసీలను ఎంపీవో సన్మానించారు. ఐకేపీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రమేశ్, ఎంపీటీసీ రుద్రభట్ల సంతోష్‌కుమార్, ఏపీఎం ఉమారాణి, కో ఆప్షన్ సభ్యుడు జాహెద్ అలీ, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ నరేశ్, సీనియర్ సహాయకులు లక్ష్మీనారాయణ, పంచాయతీ కార్యదర్శులు , వెలుగు సీసీ శ్రీధర్, శివరాం, అంగన్వాడీ టీచర్లు, సిబ్బంది, మహిళలు పాల్గొన్నారు.
మందమర్రి రూరల్, మార్చి 7 : మండల ఐకేపీ కార్యాలయంలో మహిళా దినోత్సవం సందర్భంగా సిబ్బంది వేసిన ముగ్గులను పరిశీలించి బహుమతులు డీఆర్డీవో కిషన్ అందజేశారు. అంతకుముందు రాబోయే పార్లమెంట్ ఎన్నికలు, ఓటింగ్ శాతం పెంపు అంశాలపై సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రాజేశ్వర్ ఏపీవో రజియా సుల్తానా, ఏపీఎం లలిత కుమారి, సీసీ చారి కార్యాలయ సిబ్బంది తదితరులున్నారు.
మహిళలు ఆత్మగౌరవంతో జీవించాలని ఎంపీపీ గుర్రం మంగా శ్రీనివాస్‌గౌడ్ పేరొన్నారు. ఎంపీడీవో కార్యాలయంలో మహిళా ఉద్యోగులను పం చాయతీ కార్యదర్శులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ వేల్పుల రవి, ప్యాక్స్ చైర్మన్ ప్రభాకర్‌రావు, ఎంపీడీవో రాజేశ్వర్, ఎంపీపీ బీరయ్య, కో ఆప్షన్ సభ్యుడు నజీరుద్దీన్ పాల్గొన్నారు.
రామకృష్ణాపూర్, మార్చి 7: క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని రామకృష్ణాపూర్లో ఠాగూర్ స్టేడియంలో మహిళలకు పాటలు, ఆటల పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను మున్సిపల్ చైర్ పర్సన్ జంగం కళ, కమిషనర్ ఎన్. మురళీకృష్ణ ప్రారంభించారు. విజేతలకు బహుమతులు అందజేశారు. మహిళా పారిశుధ్య కార్మికులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ ఎన్. మురళీకృష్ణ, వైస్ చైర్మన్ విద్యాసాగర్‌రెడ్డి, కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, మహిళలు, సిబ్బంది పాల్గొన్నారు.
లక్షెట్టిపేట, మార్చి 7: పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకల్లో ఎంపీడీవో సరోజ, మహిళా పంచాయతీ కార్యదర్శులు, ను, ఈజీఎస్ సిబ్బందిని సన్మానించారు. సూపరింటెం డెంట్ దేవేందర్‌రావు, ఎంపీవో ప్రసాద్, ఈజీఎస్ ఏపీవో వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ మోడల్ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన సెమినార్లో ప్రిన్సిపాల్ జైకిషన్ ఓజా, వైస్ ప్రిన్సిపాల్ గంగయ్య, అధ్యాపకులు, విద్యార్థినులు పాల్గొన్నారు.