కడెం, జూలై 26 : విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందా లు అన్ని సమయాల్లో సిద్ధంగా ఉండాలని నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. శనివారం కడెం ప్రాజెక్టు వద్ద ఎన్డీఆర్ఎఫ్ నిర్వహించిన మాక్ డ్రిల్‌ను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రత్యకాధికారి హరికిరణ్, స్థానిక ఎమ్మెల్యే బొజ్జు పటేల్‌తో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎన్డీఆర్ఎఫ్ చేపట్టిన రక్షణ విన్యాసాలను పరిశీలించిన అనంతరం బోటులో వెళ్లారు. అంతకుముందు స్థానిక రైతువేదికలో రేషన్ కార్డులను పంపిణీ చేశారు. కడెం మండల కేంద్రంలోని జడ్పీ పాఠశాలను తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిశోర్‌కుమార్, ఎన్డీఆర్ఎఫ్ కమాండెంట్ అమర్ ప్రతాప్‌సింగ్, ఎక్సైజ్ అధికారి రజాక్, జిల్లా పౌర సరఫరాల అధికారి రాజేందర్, తహసీల్దార్ ప్రభాకర్, ఎంపీడీవో అరుణ, ఏఎంసీ చైర్మన్ భూషణం పాల్గొన్నారు.