నిర్మల్ చైన్‌గేట్, అక్టోబర్ 28 : నిర్మల్ జిల్లా లో పత్తి కొనుగోలు ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రైతులకు ఇబ్బంది లేకుండా పత్తి కొనుగోళ్లు జరిగేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. సీసీఐ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి, రైతుల నుంచి పత్తి పంటను మద్దతు ధరకు కొనుగోలు చేయాలని స్పష్టం చేశారు. కపాస్ కిసాన్ యాప్ ద్వారా స్లాట్ బుక్ చేసుకోవచ్చని తెలిపారు. ఈ సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ కిశోర్‌కుమార్, కాటన్ పర్చేసింగ్ అధికారులు ఓం బూట్లే, ఈరన్న పాల్గొన్నారు.
విజిలెన్స్ అవగాహన వారోత్సవాల గోడప్రతులను కలెక్టర్ అభిలాష అభినవ్ మంగళవారం కలెక్టర్ కార్యాలయంలోని తన ఛాంబర్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. 27వ తేదీ నుంచి నవంబర్ 2వ తేది వరకు విజిలెన్స్ వారోత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ వారోత్సవాల్లో విజిలెన్స్ ప్రాముఖ్యతపై విస్తృత అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో విజిలెన్స్ ఇన్స్పెక్టర్ రవీందర్, సంతోషం, అసిస్టెంట్ జియాలజిస్ట్ వెంకటరెడ్డి పాల్గొన్నారు.