నిర్మల్ చైన్‌గేట్, ఏప్రిల్ 28 : ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆ దేశించారు. సోమవారం ప్రజావాణిలో భాగంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారి నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్, అదనపు కలెక్టర్‌కు అర్జీలు సమర్పించారు. అధిక ఉష్ణోగ్రత కా రణంగా జిల్లాలోని మారుమూల ప్రాంతాల ప్రజల సహాయా ర్థం టెలీఫోన్ ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. కలెక్టర్ అభిలాష అభినవ్ ప్రజల నుంచి ఫోన్ ద్వారా ఆర్జీలు స్వీకరించి సమస్య పరిష్కారానికి అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు కిశోర్‌కుమార్, ఫైజాన్ అహ్మద్, అధికారులు పాల్గొన్నారు.
దొంగ డీ-1 పట్టాలను రద్దు చేయాలి..
తమ గ్రామంలో దొంగ డీ1 పట్టాలు శేత్వార్లను ఇచ్చారని వాటిని రద్దు చేయాలని కోరుతూ సోమవారం నిర్మల్ జిల్లా మామడ మండలంలోని న్యూ లింగంపల్లి గ్రామానికి చెందిన వీడీసీ సభ్యులు, గ్రామస్థులు కలెక్టర్ కార్యాలయానికి వచ్చి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మా ట్లాడుతూ.. గతంలో ప్రభుత్వ భూములను పలు సర్వే నం బర్లలో గల 212.27 గుంటల భూమిని 2012 సంవత్స రం నుంచి 2025 వరకు అక్రమంగా డీ 1 పట్టాలు ఇచ్చారని పేర్కొన్నారు. నకిలీ సర్టిఫికెట్లు సృష్టించి అక్రమంగా సాగు చేసుకుంటున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. వారి నుంచి భూములు స్వాధీనం చేసుకోవాలని పేర్కొన్నారు.
అక్రమంగా కల్లు డిపో నడుపుతున్న వారిపై చర్యలు తీసుకోవాలి
కల్లు గీత వృత్తితో సంబంధం లేకుండా కల్లు డిపో నడుపు తున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం కలెక్టర్‌కు అమరవేణి నర్సాగౌడ్ ఫిర్యాదు చేశారు. నిర్మల్ గ్రామీణ మండలంలోని వెంకటాపూర్‌లో కల్లుగీత వృత్తితో సంబంధం లేకుండా అక్రమంగా కల్లు డిపోను పెట్టి కల్తీ కల్లు అమ్ముతున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కోరారు. రెండు గ్రామాల్లో టీఏఎఫ్టీ లైసెన్సులు పొందిన ఒకే వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కోరారు.