నేరడి గొండ : మండలం కేంద్రంలోని ఎమ్మెల్యే నివాసంలో బోథ్ ఎమ్మెల్యే జాదవ్ అనిల్ ( MLA Anil ) సోమవారం సీఎంఆర్ఎఫ్ చెక్కులను (CMRF cheques) అందజేశారు. నియోజకవర్గంలోని వివిధ గ్రామాల లబ్ధిదారులకు రూ. 2.50లక్షలు చెక్కులు అందించారు. లబ్ధిదారులు ఈ నిధులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
వైద్యానికి అవసరమయ్యే ఆర్థిక సహాయం కోసం పేద ప్రజలు తనను సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రాథోడ్ సజన్, నాయకులు శ్రీధర్ రెడ్డి, డాక్టర్ స్వామి,పెంటన్న, రోహిదాస్, రాటోడ్ ప్రవీణ్,మహేందర్, రఫీ,భూషణ్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.