Bharat Chauhan | దళితులను మోసం చేసిన సీఎం రేవంత్ రెడ్డి : ప్రెసిడెంట్ భరత్ చౌహన్
Bharat Chauhan | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏజెన్సీ దళితులను మోసం చేశారని లంబాడా హక్కుల పోరాట సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, బీఆర్ఎస్ జిల్లా నాయకుడు భరత్ చౌహన్ ఆరోపించారు.
నార్నూర్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ( Revanth Reddy ) ఏజెన్సీ దళితులను మోసం చేశారని లంబాడా హక్కుల పోరాట సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, బీఆర్ఎస్ జిల్లా నాయకుడు భరత్ చౌహన్ ( Bharat Chauhan ) ఆరోపించారు. ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం మహాదాపూర్ గ్రామాన్ని ఆయన సందర్శించి దళితులు ( Dalits ) ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఏజెన్సీ ప్రాంతంలో నివాసముంటున్న ఎస్సీలకు కనీస సదుపాయాలు, ప్రభుత్వ ఫలాలు అందక దయనీయ స్థితిలో జీవనం కొనసాగిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తాత ముత్తాతల కాలం నుంచి సాగు చేస్తున్న భూములకు పట్టాలు లేక రైతు భరోసా పథకానికి దూరమవుతున్నారన్నారు. కనీసం సాగు చేసే భూములకు పహనీలు నిలిపివేయడంతో బ్యాంకు రుణాలు పొందలేని దుస్థితి నెలకొందని వాపోయారు.
రోడ్డు సౌకర్యం, తాగునీటి వసతి వంటివి లేక అవస్థలు పడుతున్న పట్టించుకునే నాథులేరన్నారు. అయినప్పటికీ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి ఏజెన్సీ ప్రాంతంలోని దళితుల గురించి పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. ఈ కార్యక్రమంలో లంబాడా హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు, ప్రాథమిక సహకార సంఘం చైర్మన్ ఆడే సురేష్, బాలాజీ, రాజ్ కుమార్, అర్జున్, శుద్ధోధన్, నీల్ కంఠ్, రాందాస్, కైలాస్, చంద్రకాంత్ తదితరులున్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

