నిర్మల్ అర్బన్, అక్టోబర్ 4 : త్వరలో నిర్మల్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి వెల్లడించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని విశ్వనాథ్‌పేట్ కాలనీలో మంత్రి పర్యటించారు. ఇక్కడ ఏర్పా టు చేసిన దుర్గామాతను మంత్రి దర్శించుకుని పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడు తూ తెలంగాణ ప్రభుత్వం అన్ని వర్గాల అభి వృద్ధికి కృషి చేస్తున్నదని పేర్కొన్నారు.
పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో పట్టణాలు గణనీయంగా అభివృద్ధి చెందాయని త్వరలో నిర్మల్‌లో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారని పేర్కొన్నారు. ఒక్కో వార్డుకు రూ.50 లక్షల నిధులను మంజూరు చేయించి 42 వార్డులను అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. కాలనీల్లో సీసీ రోడ్లు, మురుగు కాలువల నిర్మాణంతోపాటు, విద్యుత్ సౌకర్యం కల్పిస్తామని తెలిపారు. కాలనీ లో సంఘం భవనానికి రూ.5 లక్షల మంజూరు చేస్తానని పోచమ్మ గుడికి రూ.10 లక్షలు, హిందూ శ్మశాన వాటికకు రూ 2 లక్షలు, కబూత ర్ కమాన్‌కు రూ. 3 లక్షలు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. త్వరలో బస్తీ దవాఖాన కాలనీకి మంజూరు చేస్తానని తెలిపారు. కాలనీ సమాఖ్య సంఘం సభ్యులు మంత్రిని సన్మానించారు. మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు.